చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్ వర్మ. ఐతే ఆయనలో ఉన్నట్లుండి పశ్చాత్తాపం మొదలై.. రంగీలా, సత్య లాంటి సినిమాల తర్వాత తాను స్థాయికి తగ్గ సినిమాలు తీయకపోవడం పట్ల ఇటీవల ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేయడం తెలిసిందే.
నిజంగా వర్మలో పశ్చాత్తాపం మొదలైందా అని సందేహిస్తున్న వాళ్లూ లేకపోలేదు కానీ.. ఆయన నిజంగా తన తప్పులు దిద్దుకుంటూ మంచి సినిమా చేస్తే బాగుంటుందని ఆశించే అభిమానుల సంఖ్య పెద్దదే. ఇటీవల సందీప్ రెడ్డి వంగ సైతం మళ్లీ పాత రాము కనిపించేలా ఓ సినిమా తీయాలని ఓ కార్యక్రమంలో కోరితే.. నిజంగానే తాను ఆ ప్రయత్నంలో ఉన్నట్లు వర్మ చెప్పడం చర్చనీయాంశం అయింది.
ఈ క్రమంలోనే లేటెస్ట్ ట్విట్టర్ పోస్ట్ వర్మ అభిమానుల్లో ఆశలు రేకెత్తించింది. ఐతే వర్మ నిజంగానే ఒకప్పటి స్థాయిలో ఓ భారీ చిత్రం చేయాలని చూస్తున్నాడన్నది తాజా సమాచారం. సర్కార్ లాంటి మరపురాని చిత్రం చేసిన అమితాబ్ బచ్చన్‌తో వర్మ మళ్లీ ఓ సినిమా చేయనున్నాడట. వర్మ మీద అమితాబ్‌కు చాలా గురి ఉంది. సర్కార్ తర్వాత కూడా ఆయన ఆగ్, సర్కార్ రాజ్, నిశ్శబ్ద్, రణ్ లాంటి సినిమాలు తీశాడు వర్మ. కానీ ఇవేవీ ఆడలేదు.
ఆ తర్వాత వర్మ అంటే అమితాబ్‌కు ప్రత్యేక అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని ఉపయోగించుకోవాలని వర్మ చూస్తున్నాడట. ఇదొక మల్టీస్టారర్ మూవీ అని.. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌ను సైతం ఈ సినిమా కోసం వర్మ సంప్రదిస్తున్నాడని ఆయన సన్నిహితుల సమాచారం.
పాన్ ఇండియా స్థాయిలో పెద్ద బడ్జెట్లో తీయాలనుకుంటున్నాడని, నిర్మాతను కూడా రెడీ చేసుకున్నాడని.. మళ్లీ తనను నమ్మి కోరుకున్న ఆర్టిస్టులు సినిమాకు ఓకే చెబితే తనేంటో చూపించాలని వర్మ పట్టుదలగా ఉన్నాడని సమాచారం. మరి ఆయన ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.
This post was last modified on January 22, 2025 9:06 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…