గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి. అవే.. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూడింట్లో మందు మొదలైన సినిమా ‘హరిహర వీరమల్లు’. అది ఎప్పుడో నాలుగేళ్ల ముందు అనౌన్స్ అయిన సినిమా. షూటింగ్ బాగా ఆలస్యం కావడంతో ఈ చిత్రం నుంచి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తప్పుకోవాల్సిన పరిస్థితి కూడా తలెత్తింది.
బ్యాలెన్స్ పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్ చేసే బాధ్యతను నిర్మాత ఏఎం రత్నం తీసుకున్నాడు. ఎట్టకేలకు నెల కిందట ఈ సినిమా చిత్రీకరణ పున:ప్రారంభం అయింది. పవన్ మళ్లీ డేట్లు కేటాయించిన తొలి చిత్రం ఇదే. పవన్ అధికారిక, రాజకీయ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా దీని షూటింగ్ విజయవాడ దగ్గర్లోనే ప్లాన్ చేశారు. సెట్స్ వేసి షూటింగ్ జరుపుతున్నారు. ఈ విషయాన్ని హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం ఓ ఇంటర్వ్యూలో ధ్రువీకరించింది.
ఓవైపు పవన్ డేట్లు ఇచ్చి షూటింగ్‌కు హాజరవుతున్నారు. మరోవైపు సినిమా నుంచి ఇటీవలే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు. దీంతో అనుకున్నట్లే మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అభిమానులు ధీమాతో ఉన్నారు. కానీ ఇటీవలి పరిణామాలు వారి ఆశలపై నీళ్లు చల్లాయి. ‘వీరమల్లు’ రావాల్సిన మార్చి 28కి ‘రాబిన్ హుడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలు షెడ్యూల్ కావడంతో ఈ చిత్రం అనుకున్న ప్రకారం విడుదల కాదని తేలిపోయింది.
‘రాబిన్ హుడ్’ హీరో నితిన్ పవన్ అభిమానే. ‘మ్యాడ్ స్క్వేర్’ నిర్మాత నాగవంశీకి పవన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి ‘వీరమల్లు’ టీం నుంచి ఒక క్లారిటీ వచ్చాకే వాళ్లు తమ సినిమాల రిలీజ్ డేట్ ప్రకటించి ఉంటారు. ఐతే మార్చి 28కి తమ సినిమా రాదని ముందే ‘వీరమల్లు’ టీం ప్రకటించి ఉంటే బాగుండేది. కానీ వాళ్ల నుంచి సౌండ్ లేదు. వాళ్ల మౌనం అసలు వేసవి చివర్లో అయినా ‘వీరమల్లు’ వస్తుందా రాదా అనే సందేహాలు రేకెత్తిస్తోంది.
పవన్ చిత్రీకరణకు హాజరవుతున్నా, జోరుగా షూట్ జరుగుతున్నా.. సినిమాను చెప్పిన డేట్‌కి రిలీజ్ చేయకపోవడానికి కారణాలేంటో వాళ్లకు అంతుబట్టట్లేదు. ఈ విషయంలో టీం నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తే బాగుంటుందని.. లేదంటే అభిమానులు నైరాశ్యంలోకి వెళ్లిపోవడం, సినిమాకు ఇంకా హైప్ తగ్గిపోవడం తప్పదని అంటున్నారు.
This post was last modified on January 21, 2025 7:08 pm
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్‌కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…