నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఒక విషయంలో సారూప్యత కొనసాగించడం అభిమానుల ఎదురుచూపులను పెంచుతోంది. అదేంటో చూద్దాం. 2011 నుంచి 2014 మధ్యలో తారక్ చాలా ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. రామయ్యా వస్తావయ్యా, రభస, దమ్ము, శక్తి, ఊసరవెల్లి ఒకదాన్ని మించి మరొకటి టపా కట్టాయి.
బాద్ షా ఒక్కటే పర్వాలేదనిపించుకుంది. అయితే టెంపర్ నుంచి జూనియర్ గేరు మార్చాడు. ఆ హిట్టు ఇచ్చిన కిక్కు తనను సరైన దారికి మళ్లించాయి. కథలు, దర్శకుల ఎంపిక జాగ్రత్తగా ఉండటం మొదలుపెట్టాడు. ఓవర్సీస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకోవడం ప్రారంభించాడు.
దాని ఫలితంగానే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ మంచి ఫలితాలు అందుకున్నాయి. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ కాబట్టి దాన్ని మినహాయించి చూస్తే తారక్ సోలోగా కొట్టిన హిట్లు ఏవీ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ కాలేకపోయాయి. సింహాద్రి తర్వాత మళ్ళీ ఆ స్థాయి ర్యాంపేజ్ లేదనేది ఒక వర్గం ఫ్యాన్స్ భావన.
దేవర ఆ లోటు కొంతవరకు తీర్చినా పుష్ప 2 లాగా వెయ్యి కోట్లు దాటి ఉంటే ఇంకా గర్వంగా చెప్పుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. ఈ వెర్షన్ ని కొట్టి పారేయలేం. వార్ 2ని పక్కనపెడితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోకి ఆ ఛాన్స్ వంద శాతం ఉందనేది స్పష్టం.
ఇక బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ తీవ్రంగా నిరాశపరిచాక బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్లు కొట్టేశారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అన్నీ ఘన విజయం సాధించాయి. అయితే బాలయ్య సీనియర్లలో చిరంజీవి, వెంకటేష్ సాధించిన వంద కోట్లకు పైగా షేర్ మాత్రం ఇంకా అందుకోలేదు.
రెండు వందల గ్రాస్ సైతం అందని ద్రాక్షగా నిలిచింది. అఖండ 2 తాండవంతో దాన్ని ఆశించడం న్యాయమే. సో తారక్ వెయ్యి కోట్లు, బాలయ్య రెండు లేదా మూడు వందల కోట్లను దాటడమే టార్గెట్ గా పెట్టుకోవాలనేది అభిమానుల ఆకాంక్ష. అది తీరే మార్గం ఎంతో దూరంలో లేదు.
This post was last modified on January 21, 2025 6:48 pm
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…
2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…
గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…
టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు……