సంక్రాంతికి ఓ పెద్ద సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుందంటే రికార్డులు బద్దలు కావాల్సిందే. ఐతే ఈసారి ‘గేమ్ చేంజర్’ లాంటి పెద్ద సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని అనుకుంటే.. మిడ్ రేంజ్ మూవీ అయిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆ బాధ్యత తీసుకుంది. ఈ ఫ్యామిలీ మూవీ సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. వారం తిరక్కముందే ఆ చిత్రం వంద కోట్ల షేర్ మార్కును దాటేసింది.
తాజాగా రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని కూడా అందుకుంది. ఇప్పుడా చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు రీజనల్ మూవీగా రికార్డును సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. ఈ రికార్డు ఇప్పటిదాకా అల్లు అర్జున్ మూవీ ‘అల వైకుంఠపురములో’ పేరిట ఉంది. 2020లో వచ్చిన ఆ చిత్రం ఫుల్ రన్లో రూ.152 కోట్ల షేర్, రూ.250 కోట్ల గ్రాస్‌తో రీజనల్ మూవీస్‌కు సంబంధించి అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసింది. నాన్-బాహుబలి హిట్‌గా నిలిచింది.
ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఆల్రెడీ రూ.200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. షేర్ రూ.140 కోట్లకు చేరువగా ఉంది. ఇంకా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడ్డ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈ వీకెండ్ వరకు వసూళ్ల మోత మోగించడం ఖాయం. కాబట్టి రూ.152 కోట్ల షేర్, రూ.250 కోట్ల గ్రాస్ మైలురాళ్లను దాటడం.. ‘అల వైకుంఠపురములో’ను వెనక్కి నెట్టి టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసింగ్ రీజనల్ మూవీగా రికార్డు సృష్టించడం లాంఛనమే.
వెంకీ లాంటి సీనియర్ హీరో.. అనిల్ రావిపూడి లాంటి కామెడీ సినిమాల డైరెక్టర్‌తో జట్టు కట్టి.. తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాతో ఇలాంటి రికార్డును అందుకోవడం సామాన్యమైన విషయం కాదు. పైగా ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ ఏమీ రాలేదు. పండక్కి చూడదగ్గ ఫ్యామిలీ మూవీ అనే మోడరేట్ టాకే వచ్చింది. అయినా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విరగబడి చూస్తుండడంతో వసూళ్ల పరంగా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి.
This post was last modified on January 21, 2025 5:34 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…