సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సక్సెస్ దగ్గుబాటి అభిమానులకు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. నలభై యాభై కాదు వారం తిరక్కుండానే ఏకంగా వంద కోట్ల షేర్ సాధించడం చూసి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సందర్భంగానే సరిగ్గా పాతికేళ్ల క్రితం జరిగిన పండగ క్లాష్ ను గుర్తు చేసుకుంటున్నారు.
2000 సంవత్సరంలో జనవరి 7 చిరంజీవి అన్నయ్య రిలీజయ్యింది. భారీ హైప్ తో మెగా ఓపెనింగ్స్ తో వసూళ్ల వర్షం మొదలెట్టింది. అయితే వారం తర్వాత జనవరి 14 బాలకృష్ణ వంశోద్ధారకుడు, వెంకటేష్ కలిసుందాం రా రెండూ ఒకేసారి థియేటర్లలో అడుగుపెట్టాయి. అప్పుడు జరిగింది అద్భుతం.
ఊహించని స్థాయిలో కలిసుందాం రా ఊరువాడా ఏకం చేసి రికార్డులు బద్దలు కొట్టింది. కుటుంబాలు తండోపతండాలుగా సినిమా హాళ్లకు వచ్చేశాయి. దెబ్బకు అన్నయ్య బాగా నెమ్మదించగా వంశోద్ధారకుడు ఫ్లాప్ టాక్ తో పుంజుకునే అవకాశం లేకుండా పోయింది. 17 కేంద్రాల్లో కలుసుందాం రా సిల్వర్ జూబ్లీ ఆడటం సరికొత్త మైలురాయి.
దానికన్నా ముందు 76 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది. అన్నయ్య కూడా బాగానే ఆడింది కానీ వెంకీ మూవీని క్రాస్ చేయలేకపోయింది. ఒక రోజు గ్యాప్ తో జనవరి 15 దాసరి సమ్మక్క సారక్క సైతం చాలా క్రేజ్ తో వచ్చింది. కానీ కలిసుందాం రా హవా ముందు నిలవలేదు.
ఇప్పుడు వర్తమానానికి వస్తే ముందు గేమ్ చేంజర్ వచ్చింది. అంచనాలు అందుకోలేక డిజాస్టర్ అయ్యింది. కానీ డాకు మహారాజ్ హిట్ టాక్ తో నూటా యాభై కోట్ల గ్రాస్ సాధించింది కానీ సంక్రాంతికి వస్తున్నాంకి స్ట్రాంగ్ కాంపిటీటర్ కాలేకపోయింది. అప్పుడు చిరంజీవి, వెంకీ విజయాలు సాధిస్తే ఇప్పుడు బాలకృష్ణ, వెంకీ పండగ జెండాలు పాతారు.
కలిసుందాం రా నాటి యుఫోరియాని గుర్తు చేసుకుంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇది, సంక్రాంతికి వస్తున్నాం రెండూ ఒకే డేట్ కి రిలీజ్ కావడం కాకతాళీయం. నాన్ రాజమౌళి, నాన్ పుష్ప 2లను లక్ష్యంగా పెట్టుకున్న సంక్రాంతికి వస్తున్నాం ఇంకేం అద్భుతాలు చేస్తుందో చూడాలి.
This post was last modified on January 21, 2025 4:09 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…