ఇటీవలే తన స్వంత అపార్ట్ మెంట్ లో దాడికి గురైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సినిమాకు సరిపడా మెటీరియల్ ని సిద్ధం చేస్తోంది. ముంబై పోలీసులు చేస్తున్న విచారణలో బయట పడుతున్న విషయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఒక సిరీస్ ప్రకారం చూస్తే కొంతమేరకు ఇది అర్థమవుతుంది.
సైఫ్ మీద అటాక్ చేసిన దుండగుడు మహమ్మద్ షరీఫుల్. ఏడు నెలల క్రితం డౌకీ నది ద్వారా బంగ్లాదేశ్ (ఝులొకటి జిల్లా) నుంచి అక్రమంగా ఇండియాలోకి చొరబడ్డాడు. విజయ్ దాస్ గా పేరు మార్చుకుని ముంబై చేరుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కి చెందిన వ్యక్తి పేరు మీద సిమ్ కార్డు తీసుకున్నాడు.
ఆధార్ పొందేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. ముంబైలో కూలి కోసం చిన్నా చితకా పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. జనవరి 16 సైఫ్ ఉండే సద్గురు అపార్ట్ మెంట్ చేరుకున్నాడు. ఎనిమిది అంతస్థుల వరకు మెట్లు ఎక్కాక పన్నెండో ఫ్లోర్ కు పైపు పట్టుకుని చేరుకున్నాడు.
సైఫ్ బాత్ రూమ్ కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించాడు. చిన్న కొడుకు జెహ్ గదిలో దూరగా సహాయంగా ఉన్న కేర్ టేకర్ కేకలు విని సైఫ్ పరుగులు పెడుతూ వచ్చాడు. పై ఫ్లోర్ లో మగ సహాయకులు నలుగురు ఉన్నప్పటికీ భయంతో కిందకు రాలేదు. దీంతో ఆయాగా ఉన్న ఆడమనిషిని కోటి డిమాండ్ చేశాడు విజయ్ దాస్ అలియాస్ షరీఫుల్.
సైఫ్ అక్కడికి చేరుకున్నాక కత్తితో దాడి చేశాడు. తీవ్ర పెనుగులాట తర్వాత అతన్ని ఒక గదిలో బంధించారు కానీ వచ్చిన దారినే తిరిగి షరీఫుల్ తప్పించుకున్నాడు. ఇంట్లో వాళ్ళు సైఫ్ ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తం 300 పోలీసులు 600 సిసి టీవీ ఫుటేజీలు చూసి ఇతన్ని పట్టుకున్నారు.
అంతకన్నా ముందు రోజు రాత్రి వర్లీలోని ఒక పావ్ భాజీ సెంటర్ లో పరోటా తిని నీళ్లు తాగి యుపిఐ పేమెంట్ చేశాడు. అప్పుడు ఇతనున్న ప్రాంతం తెలుసుకోవడానికి అవకాశం చిక్కింది. ఠాణేలోని హీరానందని ఎస్టేట్ వద్ద లేబర్ క్యాంప్ వద్ద రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఇన్వెస్టిగేషన్ సీన్ రీక్రియేషన్ లో ఇప్పటిదాకా బయటికొచ్చిన ట్విస్టులివి. ఇంకెన్ని రానున్నాయో. తాజాగా ఇవాళే సైఫ్ హాప్సిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు.
This post was last modified on January 21, 2025 3:24 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…