సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో దూసుకుపోతున్న చిత్రం.. సంక్రాంతికి వస్తున్నాం. ఈ చిత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి కానీ.. అన్నింట్లోకి హైలైట్ అయింది మాత్రం బుల్లిరాజు అనే చిన్న పిల్లాడి పాత్ర చేసిన కామెడీనే. ఓటీటీలు చూసి పాడైపోయి, కనిపించిన ప్రతి వాడి మీద బూతుల వర్షం కురిపించే పిల్లాడిగా రేవంత్ అనే అబ్బాయి అదరగొట్టేశాడు. గోదావరి స్లాంగ్‌లో అతను చెప్పిన డైలాగులకు థియేటర్లు హోరెత్తిపోతున్నాయి.
ఐతే ఈ పాత్ర విషయంలో విమర్శలు కూడా తప్పట్లేదు. అంత చిన్న పిల్లాడితో అలాంటి బూతులు చెప్పించి సొసైటీకి ఏం సందేశం ఇస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కామెడీ విషయంలో ఫిలిం మేకర్స్ మరీ ఇన్‌సెన్సిటివ్‌గా తయారవుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ పాత్రను చూసి పిల్లలు ఇన్‌స్పైర్ అయితే ప్రమాదం కదా అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించాడు.
‘‘బుల్లిరాజు పాత్రకు థియేటర్లలో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఆ కామెడీని అందరూ సరదాగా తీసుకుంటున్నారు. ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఈ పాత్ర విషయంలో విమర్శలు నా దృష్టికి వచ్చాయి. మా ఫ్రెండ్స్ కూడా కొందరు పిల్లాడితో అలా బూతులు చెప్పించడం ఏంటి అని అడిగారు. కానీ మేం ఆ పాత్రతో చిన్న సందేశం ఇచ్చాం. పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలు ఓటీటీలో కంటెంట్ చూస్తే.. వాటికి ఎక్కువ అలవాటు పడితే ఎంత ప్రమాదం అన్నది చూపించాం.
ఇంగ్లిష్, హిందీ వెబ్ సిరీస్‌లకు తెలుగు అనువాదాలు చూశారంటే దారుణమైన బూతులు ఉంటాయి. వాటిని విని తట్టుకోలేం. అలాంటివి పిల్లలు చూడకూడదని చెప్పడమే మా ఉద్దేశం. సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో చెప్పే యాడ్‌లో కూడా సిగరెట్ తాగినట్లు చూపిస్తారు. అంత మాత్రాన అది సిగరెట్ ప్రమోషన్ కాదు. అలాగే మేం కూడా ఈ పాత్రలో చెడును చూపిస్తూ చిన్న సందేశం ఇచ్చాం’’ అని అనిల్ వివరించాడు.హీరో వెంకటేష్ సైతం ఈ వాదనను సమర్థించాడు.
This post was last modified on January 20, 2025 7:35 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…