కొత్త ఏడాది మొదలయ్యాక సినీ ప్రియులందరి దృష్టి సంక్రాంతి చిత్రాల మీదే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో భారీ చిత్రాలు రిలీజవుతాయి. వారం పది రోజుల పాటు చర్చలన్నీ సంక్రాంతి చిత్రాల చుట్టూనే తిరుగుతాయి. ఈసారి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి క్రేజీ చిత్రాలు సంక్రాంతి రేసులో నిలిచాయి. వీటిలో ముందుగా రిలీజైన భారీ చిత్రం ‘గేమ్ చేంజర్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రెండో డాకు మహారాజ్ మంచి రిజల్ట్ సాధించింది.
సంక్రాంతికి వస్తున్నాం ఎవ్వరూ ఊహించని స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. ఐతే సంక్రాంతి సినిమాల కథ ఈ వీకెండ్‌తో ఒక కొలిక్కి వచ్చేసింది. వాటి ఫైనల్ రిజల్ట్ మీద కూడా ఒక అంచనా వచ్చేసినట్లే. సోమవారం నుంచి ‘గేమ్ చేంజర్’ కథ ముగిసినట్లే భావిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘డాకు మహారాజ్’ సినిమాలు ఇంకో వారం పాటు ఓ మోస్తరు వసూళ్లతో సాగే అవకాశం ఉంది. మొత్తానికి సంక్రాంతి సినిమాల చర్చలకు త్వరలో ముగియబోతున్నాయి.
ఆ తర్వాత ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే సినిమా ఏది అంటే.. ‘తండేల్’ పేరే చెప్పాలి. వచ్చే రెండు వారాలు తెలుగులో చెప్పుకోదగ్గ రిలీజ్‌లు ఏమీ లేవు. ఈ శుక్రవారం సుకుమార్ తనయురాలు సుకృతి ప్రధాన పాత్ర పోషించిన ‘గాంధీ తాత చెట్టు’ సహా ఇంకొన్ని చిన్ని చిత్రాలేవో రిలీజవుతున్నాయి. ఆ తర్వాతి వారానికి చెప్పుకోదగ్గ సినిమాలేవీ షెడ్యూల్ కాలేదు. ఈ రెండు వారాల్లో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమే.
సంక్రాంతికి బాగా ఖర్చు పెట్టేసిన ప్రేక్షకులు కొంచెం గ్యాప్ తీసుకుని ఫిబ్రవరి 7న రానున్న ‘తండేల్’ మీద ఫోకస్ చేయబోతున్నారు. ఆ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ముందు నుంచి ప్రామిసింగ్‌గా కనిపిస్తున్న చిత్రమిది. నాగచైతన్య-సాయిపల్లవి జోడీ మీద కూడా చాలా ఆశలతో ఉన్నారు.
ఈ కథ, దీని ప్రోమోలు అన్నీ కూడా ప్రేక్షకుల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఇది వంద కోట్ల సినిమా అవుతుందని నిర్మాత బన్నీ వాసు ధీమాగా చెబుతున్నాడు. రిలీజ్‌కు వారం ముందు నుంచే ‘తండేల్’ మంచి బజ్ క్రియేట్ చేసేలా ఉంది. రిలీజ్ టైంకి హైప్ వేరే లెవెల్‌కు వెళ్లడం ఖాయం.
This post was last modified on January 21, 2025 9:45 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…