సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ సినిమా వారం రోజులుగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న తీరు చూసి ట్రేడ్ పండిట్లు షాకైపోతున్నారు. సంక్రాంతి పండక్కి పర్ఫెక్ట్‌గా సూటయ్యే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు మంచి వసూళ్లు వస్తాయని అందరూ అనుకున్నదే కానీ.. మరీ ఈ స్థాయిలో వసూళ్ల మోత మోగించడం మాత్రం అనూహ్యం. వారం తిరక్కముందే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం అంటే చిన్న విషయం కాదు.
ఇదే పండక్కి రిలీజైన గేమ్ చేంజర్, డాకు మహారాజ్‌లను ఈ చిత్రం పెద్ద మార్జిన్‌తో వెనక్కి నెట్టి బాక్సాఫీస్ దగ్గర రాంపేజ్‌ను కొనసాగిస్తోంది. విడుదలైన 5, 6 రోజుల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’కు వచ్చిన వసూళ్లు చూస్తే షాకవ్వక తప్పదు. ఈ రెండు రోజుల్లో మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.25 కోట్ల మేర షేర్ రాబట్టింది ‘సంక్రాంతికి వస్తున్నాం’. రిలీజైన 5, 6 రోజుల్లో బాహుబలి-2, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి భారీ చిత్రాలను మించి తెలుగు రాష్ట్రాల్లో షేర్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.
తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన 5వ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ పేరిట రికార్డు ఉంది. ఆ చిత్రం రూ.13.63 కోట్ల షేర్ రాబట్టింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ.12.75 కోట్లతో రెండో స్థానం సాధించింది. అల వైకుంఠపురములో రూ.11.43 కోట్లు, బాహుబలి-2 రూ.11.35 కోట్లతో వరుసగా 3, 4 స్థానాల్లో ఉన్నాయి. ఆదివారం, ఆరో రోజు అయితే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును సైతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ దాటేసింది.
‘ఆర్ఆర్ఆర్’ ఆరో రోజు రూ.9 కోట్ల షేర్ సాధిస్తే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ.12.5 కోట్ల మేర షేర్ కొల్లగొట్టింది. విశేషం ఏంటంటే.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్‌ట్రా టికెట్ల రేట్లు కూడా లేవు. నార్మల్ రేట్లతోనే ఈ చిత్రం ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఆక్యుపెన్సీలు భారీగా ఉండడమే దీనికి కారణం. తొలి రోజు నుంచి ఆరో రోజు వరకు ఈ చిత్రానికి థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి.
నిన్న, ఆదివారం రోజు కూడా ఈ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమైంది. ఈ రోజు నుంచి ఆక్యుపెన్సీలు తగ్గొచ్చు. ఫుల్ రన్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ.300 కోట్ల మేర గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక మిడ్ రేంజ్ సినిమా ఈ స్థాయి సక్సెస్ సాధించడం అనూహ్యం.
This post was last modified on January 20, 2025 7:02 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…