వరసగా నాలుగో బ్లాక్ బస్టర్ బాలకృష్ణ ఖాతాలో వేసిన డాకు మహారాజ్ ఎనిమిది రోజులకు 156 కోట్లకు పైగా గ్రాస్ సాధించి బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. దీని పొటెన్షియాలిటీకి రెండు వందల కోట్లు దాటేసి ఉండాలనేది అభిమానుల వెర్షన్. నిర్మాత నాగవంశీ కూడా ఇదే తరహా ధీమా ముందు నుంచి వ్యక్తం చేస్తూ వచ్చారు.
అయితే వైడి రాజు అలియాస్ వెంకటేష్ రూపంలో స్పీడ్ బ్రేకర్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. పండగ పోటీలో చివరిగా వచ్చిన సంక్రాంతి వస్తున్నాం అనూహ్యంగా కేవలం ఫస్ట్ వీక్ కే 100 కోట్ల షేర్ దాటడం మాటలకందని అనూహ్యం. ఇంత విజయం టీమ్ ఊహించి ఉండదనేది వాస్తవం.
ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఏమో అనుకోవచ్చు కానీ సంక్రాంతికి వస్తున్నాంకి మాస్ అండ పుష్కలంగా దక్కిందని కలెక్షన్లు స్పష్టం చేస్తున్నాయి. మండపేట లాంటి చిన్న సెంటర్లలోనూ ఆర్ఆర్ఆర్ రికార్డులు బద్దలు కొట్టడమంటే మాటలు కాదు. అక్కడే కాదు చాలా కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
కొన్ని చోట్ల పుష్ప 2ని దాటేసే దిశగా పరుగులు పెడుతోంది. టాక్ ఒక వైరల్ ఫీవర్ లా పాకిపోవడంతో జనాలు మొదటి ప్రాధాన్యతగా సంక్రాంతికి వస్తున్నాంనే ఎంచుకుంటున్నారు. తర్వాత ఆప్షన్ గా డాకు మహారాజ్ నిలుస్తోంది. గేమ్ ఛేంజర్ పూర్తిగా రేసు నుంచి తప్పుకోవడం సానుకూలంగా పని చేసింది.
ఒకవేళ డాకు మహారాజ్ కనక సోలోగా వచ్చి ఉంటే ఇంకా మెరుగ్గా నడిచేదన్న కామెంట్స్ ని కొట్టిపారేయలేం. పైగా ఓవర్సీస్ కి కంటెంట్ డెలివరీలో జరిగిన జాప్యం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించింది. ఏపీలో ఇచ్చిన టికెట్ రేట్ల పెంపు కలెక్షన్ నెంబర్లు త్వరగా చేరుకునేందుకు దోహదపడింది.
ఫ్యాన్స్ ని వంద శాతం సంతృప్తి పరిచిన డాకు మహారాజ్ అసలు స్టామినా పూర్తిగా బయట పడి ఉంటే ఇండస్ట్రీ హిట్ అయ్యేదనే మాటల కోణంలో చూస్తే ఇంకో ముప్పై నలభై కోట్లు త్వరగా తోడయ్యేవి. పండగ అయిపోయినా దగ్గరలో చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. సో ఫైనల్ అయ్యేలోపు డబుల్ సెంచరీ అసాధ్యమైతే కాదు.
This post was last modified on January 20, 2025 4:00 pm
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…