తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు ఎవరు ఔనన్నా… కాదన్నా… గురుశిష్యులే. బీఆర్ఎస్ తోనే రాజకీయ జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి… ఆ పార్టీలో అతి తక్కువ కాలమే కొసనాగారు. ఆ తర్వాత నేరుగా టీడీపీలోకి వచ్చి చేరిన రేవంత్ దశ దిశను చంద్రబాబు ఓ రేంజీలోకి తీసుకెళ్లిపోయారు. తొలిసారి ప్రజా ప్రతినిధిగా రేవంత్ కు అవకాశం ఇచ్చింది చంద్రబాబే. వెరసి రేవంత్ కు రాజకీయంగా ఓనమాలు దిద్దించింది చంద్రబాబే. అందుకే కాబోలు… టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్న సందర్బంగా చంద్రబాబును కలిసి మరీ రేవంత్ తన నిర్ణయాన్ని చెప్పి..పార్టీ మారారు.
సరే… ఇదంతా ఇప్పుడెందుకు గానీ… గురుశిష్యులు ఇద్దరూ ఇప్పుడు విదేశీ గడ్డపై తళుక్కుమన్నారు. న్యూజిల్యాండ్ నగరం దావోస్ లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు కోసం ఇద్దరు నేతలు… తమ తమ రాష్ట్రాల ప్రతినిధి బృందాలకు నేతృత్వం వహిస్తూ సోమవారం ఉదయం అక్కడికి సమీపంలోని జ్యూరిచ్ ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి చంద్రబాబు, సింగపూర్ నుంచి రేవంత్ జ్యూరిచ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా తాను జ్యూరిచ్ ఎయిర్ పోర్టు చేరుకున్న సమయంలో అక్కడే చంద్రబాబు కూడా ఉన్నారని తెలుసుకున్న రేవంత్ వెంటనే ఆయనను కలిసేందుకు వెళ్లారు.
తన వద్దకు వచ్చిన రేవంత్ ను చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. ఇద్దరు నేతల మధ్య కుశల ప్రశ్నలు అయ్యాక… కలిసి కూర్చుని తేనీరు సేవించారు. ఈ సందర్భంగా రేవంత్ వెంట ఉన్న తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును చంద్రబాబు దగ్గరకు పిలిచి ఆయన భుజంపై చేయి వేసుకుని మరీ కులాసాగా గడిపారు. శ్రీధర్ బాబు తండ్రి దివంగత డి. శ్రీపాదరావుతో చంద్రబాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. శ్రీపాదరావు కాంగ్రెస్ లో ఉన్నా… సమకాలీన రాజకీయ నేత కావడంతో దివంగత సీఎం వఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి సాగిన శ్రీపాదరావుతో చంద్రబాబు మంచి స్నేహ సంబంధాలను నెరపారు.
ఇక ఈ భేటీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు కాసేపు అలా పిచ్చాపాటిగా కాలక్షేపం చేశారు. తర్వాత ఎవరి పనిలో వారు పడిపోయారు. దావోస్ లో సదస్సు ప్రారంభం అయ్యేలోగానే.. జ్యూరిచ్ లోనే కార్యరంగంలోకి దిగిపోనున్న ఇద్దరు సీఎంలు తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను రాబట్టే పనిని మొదలు పెట్టేశారు.
This post was last modified on January 20, 2025 2:18 pm
గేమ్ ఛేంజర్ ఫలితం తేలిపోయింది. పండగ సెలవులు పూర్తి కాకముందే డిజాస్టర్ ముద్ర పడిపోయింది. యావరేజ్ అయినా అభిమానులు కాస్త…
టిక్ టాక్... చైనాకు చెందిన ఈ షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ అగ్రరాజ్యం అమెరికాలో నిషేధానికి గురైపోయిన సోషల్…
ఇటీవలే బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజయ్యింది. 1998లో మొదటిసారి విడుదలైనప్పుడు ఇదో మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది.…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయినా మహా అయితే నెల రోజులు స్ట్రాంగ్ రన్…
టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం…
ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను…