టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు. ‘ఖైదీ నంబర్ 150’తో రీఎంట్రీ ఇచ్చాక కూడా ఆయన రికార్డుల పరంపర కొనసాగించారు. సీనియర్ హీరోల్లో ఎవరికీ సాధ్యం కాని 100 కోట్ల షేర్‌ను అందుకున్నారు. అలాగే ‘వాల్తేరు వీరయ్య’తో రూ.200 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసిన తొలి సీనియర్ హీరోగానూ రికార్డు సృష్టించారు.
ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఒకేసారి చిరుకు సాధ్యమైన రెండు ఘనతలనూ అందుకుంటుండడం విశేషం. సంక్రాంతికి రిలీజై అదిరిపోయే వసూళ్లతో సాగిపోతున్న ఆయన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూడో రోజుకే వంద కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని కూడా దాటేస్తోంది. ఆల్రెడీ ఈ చిత్రం రూ.100 కోట్ల షేర్ క్లబ్బులోకి కూడా అడుగు పెట్టింది.
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో చిరుకు మాత్రమే సాధ్యమైన రూ.100 కోట్ల షేర్, రూ.200 కోట్ల గ్రాస్ మార్కును ఒకేసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో అందుకున్నాడు వెంకీ. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఊపు చూస్తుంటే సీనియర్ హీరోల్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం కూడా లాంఛనమే. ఈ మూవీ బాక్సాఫీస్ డ్రీమ్ రన్ ఇలాగే కొనసాగితే ఫుల్ రన్లో రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని కూడా అందుకోవడం కష్టమేమీ కాదు.
ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఓవర్సీస్‌లో సైతం హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్తోందీ చిత్రం. వచ్చే వారం చెప్పుకోదగ్గ కొత్త సినిమాలేవీ లేవు కాబట్టి రెండో వీకెండ్ అయ్యే వరకు ఈ సినిమా ఊపు కొనసాగడం ఖాయం. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం క్యూలు కడుతుండడంతో ఫుల్ రన్ వసూళ్లు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయి.
This post was last modified on January 20, 2025 3:07 am
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…