సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ ఆర్టిస్టుగా మారిన కన్నడ నటి పవిత్ర లోకేష్‌తో ఆయన బంధం వివాదానికి దారి తీసింది. నరేష్‌కు చాలా ఏళ్లుగా దూరంగా ఉన్న ఆయన భార్య రమ్య ఈ విషయంలో ఎంత గొడవ చేసిందో.. దీని మీద కొన్నాళ్ల పాటు మీడియాలో ఎంత చర్చ జరిగిందో తెలిసిందే.
ఐతే తర్వాత ఈ వ్యవహారం సద్దుమణిగింది. నరేష్.. పవిత్రతో సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. నరేష్ కెరీర్ పరంగా టాలీవుడ్లో బిజీ ఆర్టిస్టుల్లో ఒకరిగా వెలుగొందుతూనే వ్యక్తిగత జీవితంలోనూ సంతోషంగా సాగిపోతున్నారు. సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో ఆయన కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలేకరులను కలిసిన ఆయనకు.. పవిత్ర లోకేష్ గురించి ప్రశ్న ఎదురైంది.
పవిత్ర మీ జీవితంలోకి వచ్చాక వచ్చిన మార్పులేంటి అని అడగ్గా, ఆయన దానికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “పవిత్ర నా జీవితంలోకి వచ్చాక టైటానిక్ షిప్ ఒడ్డుకు చేరింది. సినిమా వాళ్లుగా మాది విభిన్నమైన జీవితం. మేం చెడ్డ వాళ్లం కాదు. మాకు ఎమోషన్లు ఎక్కువ. మా సమయాన్ని వ్యక్తిగత జీవితం కంటే సినిమా కోసమే ఎక్కువ కేటాయించాల్సి ఉంటుంది. ఫ్యామిలీ టైం తక్కువ ఉంటుంది. అలాంటపుడు మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడం ముఖ్యం. నా అదృష్టం కొద్దీ ఇదే ఇండస్ట్రీకి చెందిన పవిత్ర నా జీవితంలోకి వచ్చింది. కాబట్టి ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. ఆమె రావడం వల్ల టైటానిక్ షిప్ తీరం చేరినట్లయింది” అని నరేష్ తెలిపారు.
ఇక తాను భవిష్యత్తులో ఏదో ఒక రోజు డైరెక్షన్ చేస్తానని ఈ సందర్భంగా నరేష్ తెలిపారు. గతంలో ఒక కథ రాశానని.. కొన్ని కారణాల వల్ల డైరెక్షన్ ఛాన్స్ మిస్సయిందని.. త్వరలో ఆ కల తీర్చకుంటానని ఆయనన్నారు. తన తల్లి బయోపిక్ తీసే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
This post was last modified on January 20, 2025 3:03 am
స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…
కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…
దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…