గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె, వేట్టయాడు విలయాడు, ఎన్నై అరిందాల్ లాంటి క్లాసిక్స్ అందించిన దర్శకుడతను. తక్కువ సినిమాలతోనే లెజెండరీ స్టేటస్ అందుకున్న ఈ దర్శకుడు.. అరంగేట్రం చేసిన పాతికేళ్ల తర్వాత కూడా ట్రెండీగా సినిమాలు తీస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
ఐతే తాను గతంలో డైరెక్ట్ చేసిన ఓ సినిమాతో తనకు సంబంధం లేనట్లు తాజాగా గౌతమ్ మీనన్ చేసిన కామెంట్ సంచలనం రేపుతోంది. గౌతమ్.. ధనుష్ హీరోగా ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ అనే సినిమా తీశాడు. గౌతమ్ గత కొన్ని చిత్రాల మాదిరే ఇది కూడా విడుదల విషయంలో సమస్యలు ఎదుర్కొని ఆలస్యంగా, 2019లో విడుదలైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇందులో గౌతమ్ మార్కు కనిపించలేదన్న విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఆ సినిమాను గౌతమ్ డిస్ ఓన్ చేసుకోవడం గమనార్హం.
తన దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా రానున్న కొత్త చిత్రం ‘డొమినిక్’ విడుదల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ధనుష్‌తో తన సినిమా గురించి అడిగితే షాకింగ్ కామెంట్స్ చేశాడు గౌతమ్ మీనన్. “మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? ఆ సినిమా గురించి నేను మరిచిపోయాను. దాని గురించి నాకు ఏమీ గుర్తు లేదు. అందులోని ఒక పాట మాత్రమే గుర్తుంది. అది నా సినిమా కాదు. వేరే ఎవరిదైనా అయ్యుండొచ్చు” అని గౌతమ్ వ్యాఖ్యానించాడు.
గౌతమ్ నిర్మాణ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ విడుదల సమస్యగా మారిన పరిస్థితుల్లో.. బ్యాలెన్స్ పార్ట్ చిత్రీకరణను హీరో ధనుషే పూర్తి చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు గౌతమ్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే అప్పుడు జరిగిన ప్రచారం నిజమే అని అర్థమవుతోంది. మేఘా ఆకాష్ కథానాయికగా నటించిన ఈ చిత్రం గౌతమ్, ధనుష్‌ల ఫిల్మోగ్రఫీలోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
This post was last modified on January 20, 2025 3:00 am
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…
ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది…
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…