Movie News

దిల్ రాజు కోసం చరణ్ మరో సినిమా ?

యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు లోను కావడం విచిత్రం. సరిగ్గా పదకొండు సంవత్సరాల క్రితం 2014లో ఈ కలయికలో ఎవడు వచ్చింది. వంశి పైడిపల్లి దర్శకత్వంలో అనుకున్న టైంకి పూర్తి చేయలేకపోయారు. చాలా బ్రేకులు పడ్డాయి. ప్రొడ్యూసర్ గా పీక్స్ ఉన్న టైంలోనే దిల్ రాజుకి దీంతో సమస్యలు వచ్చాయి. ఎట్టకేలకు రిలీజ్ చేసి కమర్షియల్ గా సూపర్ హిట్ అందుకున్నారు కానీ ఫ్యాన్స్ ఆశించినట్టు రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో బ్లాక్ బస్టర్ పడలేదు. కట్ చేస్తే ఇప్పుడు గేమ్ ఛేంజర్ వంతు.

దర్శకుడు, టీమ్ తో పాటు ఈసారి ఫలితం కూడా మారింది. మూడేళ్ళ నిర్మాణం, చరణ్ విలువైన సమయం, 50వ సినిమాగా ఎస్విసి సంస్థ మైలురాయి ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఎవడు చెప్పుకోవడానికి విజయం సాధించింది కానీ గేమ్ ఛేంజర్ దానికి నోచుకోలేదు. దిల్ రాజు ఏ మేరకు నష్టాలు భరించబోతున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. సంక్రాంతికి వస్తున్నాం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు కనక అదయ్యాక గేమ్ ఛేంజర్ లెక్కల మీద దృష్టి పెట్టొచ్చు. షాక్ ఇచ్చే నెంబరే నష్టంగా మిగలనుంది. దీన్ని రికవర్ చేయాలనే ఉద్దేశం మూడో సినిమా రాజు గారి బ్యానర్ లోనే చేసేందుకు రామ్ చరణ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు వినికిడి.

ఇంకా ప్రకటన రాలేదు కానీ ఒకవేళ నిజమైతే మాత్రం బాగానే టైం పడుతుంది. ఎందుకంటే బుచ్చిబాబు డైరెక్షన్లో నిర్మాణంలో ఉన్న ఆర్సి 16 అయ్యాక సుకుమార్ తో ఆర్సి 17 మొదలవుతుంది. ఇవి రెండు అయ్యేలోపు ఏదైనా కథ, దర్శకుడు కుదిరితే రామ్ చరణ్ దిల్ రాజుకో సినిమా చేసే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతానికి ఇవన్నీ ఫిలిం నగర్ లో జరుగుతున్న చర్చలే తప్ప నిర్ధారణగా మ్యాటర్ తెలియాల్సి ఉంది. చిన్న ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లి హైదరాబాద్ కు వచ్చేసిన చరణ్ త్వరలోనే ఆర్సి 16 కొత్త షెడ్యూల్ లో అడుగు పెట్టబోతున్నారు. అనుకున్న టైంకన్నా ముందే రిలీజ్ చేయొచ్చని సమాచారం.

This post was last modified on January 18, 2025 11:20 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

12 hours ago