బిగ్ బాస్ సీజన్ 4ని వీలయినంత అన్‍ప్రిడిక్టబుల్‍గా వుంచాలని షో డైరెక్టర్లు ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. ఒకవేళ ఎవరయినా కంటెస్టెంట్లకు అభిమానులు పెరుగుతున్నారనిపిస్తే వారిని పర్సనల్‍గా టార్గెట్ చేస్తూ వీక్ అయ్యేట్టు చూస్తున్నారు. ఉదాహరణకు అభిజీత్ హౌస్‍లోకి వెళ్లిన తొలినాళ్లలో చాలా కాన్ఫిడెంట్‍గా వుండేవాడు. తనను నామినేట్ చేసినా ఎలిమినేట్ కాననే ధీమా చూపించేవాడు. అయితే అతడి ఆటను పదే పదే ప్రశ్నించి అతడిలో అనుమానాలు పెంచడంతో ఇప్పుడతను కాన్ఫిడెన్స్ కోల్పోయాడు.
అలాగే సోహైల్ ఆవేశాన్ని ఎత్తి చూపించడంతో అతడూ డిఫెన్స్లో పడిపోయాడు. ఇక ఈ షోలో వున్న లేడీ కంటెస్టెంట్లు అందరూ చాలా వీక్‍గా వున్నారు. వీరి పట్ల ఆడియన్స్లో ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడకపోవడంతో ఎప్పుడయినా అవుట్ అయ్యేలా వున్నారు. దీంతో బిగ్‍బాస్ వ్యూహకర్తలు లేడీ కంటెస్టెంట్లను హైలైట్ చేసే ఎపిసోడ్ టెలికాస్ట్ చేసారు. చిన్ననాటి జ్ఞాపకాలు చెప్పుకుంటూ లాస్య, అరియానా, హారిక చెప్పిన తమ పర్సనల్ స్టోరీలు ఆడియన్స్ను విశేషంగా కదిలించాయి. వారి పట్ల ప్రేక్షకులలో సింపతీ వచ్చేట్టు చేసాయి.
ఈ వారం కనుక ఎలిమినేషన్ తప్పించుకున్నట్టయితే వచ్చేవారం నుంచీ వీరికి ఓటింగ్‍లో ఎడ్జ్ వుంటుంది. వరుసగా ఆడవాళ్లు ఎలిమినేట్ అవుతూ వుండడంతో మగాళ్లపై గురి పెట్టడం కోసం బిగ్‍బాస్ ఈ ఎత్తు వేసినట్టు అనిపిస్తోంది.
This post was last modified on October 16, 2020 10:31 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…