సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్ ఇండియా మూవీ మీద ప్రభావం చూపించేంత. కొన్నిసార్లు హద్దులు దాటి పరస్పరం మాటల దాడులతోనే వ్యక్తిత్వ హననం చేసుకునేంత.
హీరోలు ఇలాంటివి చేయొద్దంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి చెబుతూనే ఉన్నా ఫ్యాన్స్ చెవులకు ఎక్కడం లేదు. అదేదో ఘనకార్యంలాగా పదే పదే వాటికే పాల్పడుతున్నారు. డాకు మహారాజ్ సక్సెస్ ఈవెంట్ లో సంగీత దర్శకుడు తమన్ దీని గురించి ఓపెనయ్యాడు. సినిమాలను చంపొద్దంటూ బహిరంగంగా విన్నవించుకున్నాడు.
సక్సెస్ వస్తే అందులో ఉండే ఆనందమే వేరని కానీ దాన్ని అందుకోకుండా తప్పుడు ఉద్దేశాలతో విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దంటూ హితవు పలికాడు. తమన్ చెప్పింది నిజంగా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే. నెగటివ్ ట్రెండ్స్ వల్ల మనస్థాపం కలుగుతోందని, నిర్మాతలను గౌరవించడం మన బాధ్యతంటూ మంచి విషయాలు చెప్పాడు.
గత కొన్ని నెలలుగా ఈ ధోరణి తీవ్ర రూపం దాల్చిన మాట వాస్తవం. దేవర, కల్కి నుంచి మొన్న గేమ్ ఛేంజర్ దాకా ఎన్నో పెద్ద సినిమాలను లక్ష్యంగా చేసుకున్న కొందరు యాంటీ ఫ్యాన్స్ ఒక ప్రమాదరకమైన సంస్కృతికి బీజం వేశారు. అదిప్పుడు చెట్టవుతోంది.
మొగ్గలోనే తుంచితే మంచిదనేది తమన్ అభిప్రాయం. లేదంటే ఇది తర్వాతి జనరేషన్లకు పాకిపోయి వాళ్ళు కూడా ఇదే అలవాటు చేసుంటారు. మేం మేం బాగుంటామని హీరోలు ఎన్నిసార్లు చెప్పినా అభిమానులు మళ్ళీ మళ్ళీ మొదటికే వస్తున్నారు. గుంటూరు కారం ఆడియో టైం తమన్ వీటికి బలయ్యాడు.
జరగండి జరగండి లీక్ లోనూ ఇలాగే చేశారు. లెక్కలేనన్ని సార్లు టార్గెట్ గా పెట్టుకుని మరీ ట్రోల్ చేశారు. చాలా సహనంతో భరిస్తూ వచ్చిన తమన్ డాకు వేడుకలో ఓపెనయ్యాడు. ఎవరినీ తిట్టకుండా జీవితంలో ఏం చేయాలనే స్పష్టత యువతకు ఉండాలని కోరాడు. విని ఆచరిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
This post was last modified on January 17, 2025 9:51 pm
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…