ఇండియన్ స్పిల్బర్గ్ గా అభిమానులు పిలుచుకునే దర్శకుడు శంకర్ కొన్నేళ్లుగా తన ముద్ర వేయలేకపోవడం చూస్తున్నాం. 2.0కి ప్రశంసలు వచ్చాయి కానీ నిర్మాతకు లాభాలు దక్కలేదు. ఇండియన్ 2 ఏకంగా ఆ సినిమా బ్రాండ్ మీదే మచ్చ తెచ్చి పెట్టింది. ఇక గేమ్ ఛేంజర్ మరీ అంత అన్యాయంగా లేకపోయినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఎదురీదుతోంది.
రామ్ చరణ్ ఇమేజ్, ప్యాన్ ఇండియా రిలీజ్ వల్ల ఏదో వంద కోట్లు దాటేసింది కానీ దిల్ రాజుకు భారీ నష్టం తప్పదనే చేదు నిజం కళ్ళముందు కనిపిస్తోంది. చివరికి టాలీవుడ్ స్ట్రెయిట్ డెబ్యూ శంకర్ కి నిరాశే మిగిల్చింది. ఇది ఎవరూ కాదనలేరు.
ఇక శంకర్ కూతురు ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. ఆయన కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటించిన నేసిప్పాయ మొన్న పధ్నాలుగున రిలీజయ్యింది. పవన్ కళ్యాణ్ పంజా, అజిత్ బిల్లా లాంటి భారీ చిత్రాలు హ్యాండిల్ చేసిన విష్ణువర్ధన్ దీనికి దర్శకుడు.
హీరో ఆకాష్ మురళి. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా మన శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రేమించిన అమ్మాయి పోర్చుగల్ దేశంలో హత్య కేసులో ఇరుక్కుంటే ఆమెను కాపాడేందుకు ఓ యువకుడు చేసే సాహసమే నేసప్పాయ. లైన్ బాగానే ఉన్నా ట్రీట్ మెంట్ హెచ్చుతగ్గుల వల్ల ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
యావరేజ్ రిపోర్ట్స్ తో బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ఈ సినిమా అదితి శంకర్ కు హిట్ ఇవ్వలేకపోయిందని వసూళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఇది తన డెబ్యూ మూవీ. కార్తీ విరుమాన్ తో పరిచయమయ్యాక శివ కార్తికేయన్ మావీరన్ తో హిట్టు కొట్టింది. ఇప్పుడు బ్రేక్ పడింది.
తెలుగులో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన నటించిన భైరవం వచ్చే నెల రిలీజ్ కానుంది ఓ వెన్నెల పాటలో తన లుక్స్ యూత్ ని ఆకట్టుకుంటున్నాయి. గేమ్ ఛేంజర్ అమెరికా ఈవెంట్ లో రామ్ చరణ్ ఫ్యాన్ గా చెప్పుకోవడం ఫాన్స్ కి గుర్తే. భైరవం కనక హిట్ అయితే ఇక్కడ మంచి కెరీర్ నిర్మించుకోవడానికి ఛాన్స్ ఉంది. చూడాలి మరి.
This post was last modified on January 17, 2025 5:37 pm
సూర్య సినిమా ‘కంగువా’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆ…
సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్…
ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర…
దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్రపంచశాంతిని ప్రశ్నార్థకంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ…
ఒకప్పుడు నిలకడగా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర నిర్మాత దిల్ రాజు.. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది…
హీరోలు ఆడవేషంలో కనిపించడం టాలీవుడ్ లో కొత్తేమి కాదు. కానీ అది కొన్ని నిమిషాలకు మాత్రమే పరిమితమవుతుంది. చంటబ్బాయిలో చిరంజీవిని…