Movie News

రావిపూడి చెప్పిన స్క్రీన్ ప్లే పాఠం

ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర స్టేషనరీ ఉంటే చాలు స్క్రిప్ట్ లు రాసేవాళ్ళు. పరుచూరి, సత్యానంద్, జంధ్యాల, త్రివిక్రమ్ తదితరులంతా దీన్ని ఫాలో అయినవాళ్లే. కానీ ట్రెండ్ పేరుతో చాలా పద్ధతులు వచ్చాయి.

పిచ్ డెక్, పవర్ పాయింట్, సెల్టెక్స్ అంటూ రకరకాల సాఫ్ట్ వేర్లు వాడుతున్నారు. వాటి ద్వారా కథలను ఫిల్టర్ చేస్తున్న దర్శక నిర్మాతలు పరిశ్రమలో చాలా ఉన్నారు. ఒకవేళ ఇవి వాడటం రాకపోతే అవకాశాలు పోగొట్టుకున్న రైటర్లు బోలెడు. కానీ అసలు ముడిసరుకైనా క్రియేటివిటీ మాత్రం మెదడులో నుంచే రావాలిగా.

దర్శకుడు అనిల్ రావిపూడి ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్ లో చెప్పిన విషయాలు చెంపపెట్టులా ఉన్నాయి. స్టోరీ ఇలాగే రాయాలి, స్క్రీన్ ప్లే స్టడీ, క్యారెక్టర్ ఆర్క్ లాంటి క్లిష్టమైన పదాలు తనకు తెలియవని, థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడికి ఏం కావాలో అవి మాత్రమే చూస్తాను తప్పించి మిగిలినవి తనకు అవసరం లేదని చెప్పేశాడు.

ఇకపై కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతానని కుండబద్దలు కొట్టేశాడు. ఈలలు, చప్పట్లు, కన్నీళ్లు ఏ ఎమోషన్ అయినా ఆడియన్స్ లో నుంచి చూసినవాణ్ణి కాబట్టే అవన్నీ అక్కడే నేర్చుకున్నానని క్లారిటీ ఇచ్చేశాడు. ఎనిమిది వరస హిట్లు కొట్టిన డైరెక్టర్ గా అతను చెప్పిన దాంట్లో నిజముంది.

ఇండస్ట్రీలోనే కాదు జనంలోనూ మనల్ని తీసుకెళ్లేది సక్సెసే. అంత పెద్ద నిర్మాత దిల్ రాజు, శిరీష్ లే అనిల్ రావిపూడిని ఆకాశానికి ఎత్తుతున్నారంటే ఏ స్థాయిలో మేజిక్ చేసి ఆ సంస్థకు కాసుల వర్షం కురిపిస్తున్నాడో వేరే చెప్పాలా. చిరంజీవితో చేయబోతున్న రావిపూడి మెగాస్టార్ ని ఎలా చూపిస్తాడనే ఆసక్తి ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది.

ఈ నెలలోనే ప్రకటన వచ్చి త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. 2026 సంక్రాంతి విడుదలనే ప్రచారం ఆల్రెడీ మొదలైపోయింది. ఎన్ని ప్యాన్ ఇండియా సినిమాలు తీశామన్నది కాదు లోకల్ గా తీసినా గ్లోబల్ బ్లాక్ బస్టర్లు కొట్టడమే ప్రధానంగా అనిల్ దూసుకుపోతున్నాడు.

This post was last modified on January 17, 2025 7:24 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

14 minutes ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

1 hour ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

1 hour ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

3 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

4 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

5 hours ago