ఒక్కోసారి ఎంత హిట్టు కొట్టినా ఆశించినంత పేరు రాకపోవడం నటీనటుల విషయంలో జరుగుతుందేమో కానీ దర్శకులకు అరుదు. కానీ సుందర్ సి దానికి మినహాయింపుగా నిలుస్తున్నారు. ఇటీవలే ఆయన డైరెక్ట్ చేసిన మదగజరాజా 12 సంవత్సరాల తర్వాత రిలీజైయ్యింది. విశాల్ లాంటి పేరున్న హీరోతో చేసినప్పటికీ ఆర్థిక కారణాల వల్ల దశాబ్దానికి పైగానే ల్యాబులో మగ్గుతూ వచ్చింది.
ఆఖరికి మొన్న పొంగల్ కి అజిత్ విడాముయార్చి తప్పుకోవడంతో మదగజరాజకు లైన్ క్లియర్ చేసిన నిర్మాతలు ఆఘమేఘాల మీద విడుదల చేశారు. కట్ చేస్తే తమిళనాడులో పండగ సూపర్ హిట్ గా నిలిచి విజయం అందుకుంది.
ట్విస్ట్ ఏంటంటే మదగజరాజ రొటీన్ ఫార్ములాతో సాగే మాస్ ఎంటర్ టైనర్. అయినా సరే బలమైన పోటీ లేకపోవడంతో విశాల్ బొమ్మని జనం ఎంజాయ్ చేశారు. ఇప్పటికే ఇరవై కోట్ల వసూళ్లు దాటేయగా ఫైనల్ రన్ అయ్యేలోపు 40 నుంచి 50 కోట్ల దాకా వచ్చేలా ఉంది.
ఇదిలా ఉండగా దర్శకుడు సుందర్ సి సక్సెస్ మీట్లో మాట్లాడుతూ తాను ఎంత మంచి హిట్లిచ్చినా బెస్ట్ డైరెక్టర్స్ లిస్టులో పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకులను మెప్పించడంలో తాను ఫెయిల్ కానప్పుడు ఎందుకు గుర్తించడం లేదని చెప్పుకున్నారు. ఇక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు.
సుందర్ మరీ రొటీన్ అంశాలతో సేఫ్ గేమ్ ఆడతారు. గత ఏడాది బాక్ అరణ్మయి 4లోనూ అదే చేశారు. గ్లామర్, హారర్ మీదే ఆధారపడుతూ క్రియేటివిటీకి చరమగీతం పాడారు. మదగజరాజా కూడా అంతే. వీటికి ముందు ఎక్కువ ఫ్లాపులే ఉన్నాయి. కెరీర్ మొత్తం మీద ఒక్క అరుణాచలం మాత్రమే గర్వంగా చెప్పుకునే బ్లాక్ బస్టర్.
రజినీకాంత్ తో చేసిన తర్వాత పెద్ద స్థాయికి చేరుకోలేకపోవడం సుందర్ సి దురదృష్టం. దీన్ని విశ్లేషించుకోకుండా తనను గుర్తించడం లేదనేదీ సరికాదని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా మళ్ళీ దెయ్యాల బ్యాక్ డ్రాప్ లో అరణ్మయి 5 రాసుకోవడం ఫైనల్ ట్విస్టు.
This post was last modified on January 17, 2025 3:49 pm
హీరోలు ఆడవేషంలో కనిపించడం టాలీవుడ్ లో కొత్తేమి కాదు. కానీ అది కొన్ని నిమిషాలకు మాత్రమే పరిమితమవుతుంది. చంటబ్బాయిలో చిరంజీవిని…
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలలొ ఇప్పటి వరకు కొన్ని మాత్రమే అమలు చేసింది.…
కడపలో ఎం జరిగినా సంచలనమే అవుతోంది. ఈ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా…
పుష్ప-2 సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హిందీలో అన్ని బాక్సాఫీస్ రికార్డులనూ ఈ…
మలయాళం సినిమాలు ఈ మధ్య కాలంలో కంటెంట్ ఆధారంగా వచ్చి భాషతో సంబంధం లేకుండా కొన్ని వర్గాల ప్రేక్షకులను బాగానే…
ఎప్పటినుంచో అభిమానులు కోరుకుంటున్న కాంబినేషన్ నిజంగా జరిగితే దానికొచ్చే కిక్కు మాములుగా ఉండదు. అందుకే మల్టీస్టారర్లు మనకు అరుదైపోయాయి. రజనీకాంత్…