ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా ఒడిదుడుకులు సహజం. కొన్ని బలంగా బౌన్స్ బ్యాక్ అయితే మరికొన్ని కాలగర్భంలోకి కలిసిపోతాయి. దిల్ రాజు బ్యానర్ ఎస్విసి ఎప్పుడూ మొదటి క్యాటగిరీలోనే ఉండేందుకు కష్టపడుతూ ఉంటుంది. గత కొంత కాలంగా రాజుగారి జడ్జ్ మెంట్ లెక్క తప్పుతున్న వైనం అందరూ చూస్తున్నారు.
ది ఫ్యామిలీ స్టార్ లాంటి పెద్ద సినిమా, జనక అయితే గనక లాంటి చోటా మూవీ అన్నీ దెబ్బ తిన్నాయి. బలగం హిట్టనిపించుకున్నా వెంటనే లవ్ మీ దెబ్బ కొట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో దిల్ రాజు పదుతున్న మథనం ఇటీవలి ప్రెస్ మీట్స్ లో కెమెరాల సాక్షిగా కనిపించింది.
కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. చివరి బంతికి సిక్స్ కొడితేనే గెలిచే మ్యాచులో ఆ పని చేస్తే ఎంత కిక్ ఉంటుందో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాంతో అదంతా అనుభవిస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఆశించిన ఫలితం అందుకోనప్పటికీ వెంకటేష్ మూవీ ఆడుతున్న బాక్సాఫీస్ వీరంగం గురించి వర్ణించేందుకు మాటలు చాలవు.
గతంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు కొన్నిసార్లు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్ గా పెళ్లి పందిరి, నిర్మాతగా ఆర్య ద్వారా వాటిని ఎదురుకున్నానని గుర్తి చేసుకున్నారు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అంతకు మించి అద్భుతం చేస్తోందనే ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంటూ వ్యక్తం చేశారు.
మాస్ అంశాలు పెద్దగా లేకుండా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం మూడు రోజులకే వంద కోట్లు దాటడం వెనుక వెంకటేష్, అనిల్ రావిపూడిలతో పాటు మొత్తం టీమ్ స్వయంకృషి ఉంది. జనాలు థియేటర్లు వచ్చే తీరాలనిపించేలా సినిమాని తీర్చిదిద్దిన విధానం క్లాసు మాసు తేడా లేకుండా అదరగొడుతోంది.
థియేటర్లు, షోలు ఎన్ని పెంచుతున్నా డిమాండ్ కు తగ్గట్టు సరిపోవడం లేదు. రాజుగారి సోదరుడు శిరీష్ అన్నట్టు ఎస్విసి బావిలో పడితే ఆనందించే వాళ్ళు ఇప్పుడు నోట మాట రాకుండా అయిపోయారు. అంతే మరి చావో రేవో సినిమాలే అనుకున్న వాళ్లకు విజయమే వరిస్తుంది.
This post was last modified on January 17, 2025 2:32 pm
సోషల్ మీడియా ప్రపంచంలో రోజురోజుకి నెగటివిటీ ఎక్కువైపోతోంది. ఇది ఏ స్థాయికి చేరుకుందంటే వందల కోట్లు పోసిన ఒక ప్యాన్…
ఇప్పుడు ఫిలిం మేకింగ్ లో కొత్త పోకడలు ఎన్నో వచ్చాయి. గతంలో రచయితలు పేపర్ బండిల్, పెన్ను పెన్సిల్, ఇతర…
ఇండియన్ స్పిల్బర్గ్ గా అభిమానులు పిలుచుకునే దర్శకుడు శంకర్ కొన్నేళ్లుగా తన ముద్ర వేయలేకపోవడం చూస్తున్నాం. 2.0కి ప్రశంసలు వచ్చాయి…
దాదాపు రెండు సంవత్సరాలకు పైగానే జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం .. ప్రపంచశాంతిని ప్రశ్నార్థకంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ…
ఒకప్పుడు నిలకడగా హిట్లు కొడుతూ దూసుకెళ్లిన అగ్ర నిర్మాత దిల్ రాజు.. గత కొన్నేళ్లుగా సరైన విజయాలు లేక ఇబ్బంది…
హీరోలు ఆడవేషంలో కనిపించడం టాలీవుడ్ లో కొత్తేమి కాదు. కానీ అది కొన్ని నిమిషాలకు మాత్రమే పరిమితమవుతుంది. చంటబ్బాయిలో చిరంజీవిని…