సంక్రాంతికి వస్తున్నాం వసూళ్ల ప్రవాహం చూస్తుంటే అరాచకం మాట చాలా చిన్నదనిపిస్తోంది. జనవరి ప్రారంభంలో పండక్కు ముందు గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ పోటీని తట్టుకుని వెంకీ మామ నిలబడగలడా అనే అనుమానాలు పూర్తిగా చెల్లాచెదురు చేస్తూ కేవలం 3 రోజులకే ప్రపంచవ్యాప్తంగా 106 కోట్లకు పైగా గ్రాస్ దాటేయడం మాములు రికార్డు కాదు. వెంకీ మామ కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా కూడా ఇదే.
అందులోనూ కాంపిటీషన్ వల్ల వెంకటేష్ సినిమాకు సరిపడా థియేటర్లు దొరకలేదు. అప్పటికప్పుడు డిమాండ్ కు తగ్గట్టు డిస్ట్రిబ్యూటర్లు షోలు పెంచుకుంటూ పోతున్నా సరే దాదాపు అన్ని కేంద్రాల్లో టికెట్లు దొరకడం కష్టమనేలా పరిస్థితి మారిపోయింది.
హైదరాబాద్ నుంచి అమలాపురం దాకా ఇదే సీన్ కనిపిస్తోంది. కొన్ని బిసి సెంటర్లలో ఎక్స్ ట్రా కుర్చీలు వేసినా సరిపోవడం లేదు. ఇంకొన్ని కేంద్రాల్లో గేమ్ ఛేంజర్ షోలు సంక్రాంతికి వస్తున్నాంకి ఇచ్చి సర్దుబాటు చేస్తున్నా సరే టికెట్లు దొరక్క ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంది.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తుతున్న తీరు మాములుగా లేదు. ఖచ్చితంగా మొదటి వారం చూసేయాలన్న పట్టుదలతో తండోపతండాలుగా వెళ్తున్నారు. డాకు మహారాజ్ అంత పాజిటివ్ టాక్ తో మాస్ ని ఆకట్టుకుంటున్నా వెంకీ మూవీ వల్ల వెనుకబడటం బాక్సాఫీస్ వద్ద అరుదుగా కనిపించే పరిణామం.
చూస్తుంటే మొదటి వారం అయ్యేలోపే సంక్రాంతికి వస్తున్నాం రెండు వందల కోట్లు దాటేయడం ఖాయం. చాల ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి ప్రవేశించాయి. ఏపిలో టికెట్ ధరల హైక్ ఉన్నా దాని ప్రభావం ఏ మాత్రం లేదు. పది రోజుల తర్వాత తిరిగి మాములు రేట్లు మొదలైతే ఈ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ పై స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఆదివారం దాకా ఈ ర్యాంపేజ్ తగ్గే ఛాన్స్ లేదు. బుక్ మై షోలో ఎవరికి అందనంత ఎత్తులో రోజుకు మూడు నాలుగు లక్షలకు పైగా టికెట్లు అమ్మేస్తున్న ఈ బ్లాక్ బస్టర్ పరుగు ఇప్పట్లో ఆగేలా లేదు. టైటిల్ కు తగ్గట్టే జనాలు వస్తున్నాం వస్తున్నాం అంటూ థియేటర్లు నింపేస్తున్నారు.
This post was last modified on January 17, 2025 12:45 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…