సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్న హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ నుంచి మొదటి ఆడియో సింగల్ విడుదలయ్యింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సిఎం అయ్యాక రిలీజవుతున్న మొదటి సినిమాగా దీని మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ ఆయన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన మొదటి ప్యాన్ ఇండియా మూవీ ఇది.
తొలుత సంక్రాంతికి అనుకున్నారు కానీ గేమ్ ఛేంజర్ తో పాటు ఇతర చిత్రాల హడావిడి ఉండటంతో వాయిదా వేసుకున్నారు. ఈ రోజు చెప్పిన టైంకే ఎలాంటి వాయిదాలు లేకుండా మాట వినాలి గురుడా మాట వినాలి పాట వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత స్వయంగా పాడటం ఈ సాంగ్ ప్రత్యేకత. తెలుగులో స్వంతంగా గానం చేయగా మిగిలిన భాషల్లో ఏఐ సాంకేతికత వాడి అచ్చం పవన్ గాత్రానికి దగ్గరగా మ్యాచయ్యేలా వేరే సింగర్స్ సహాయం తీసుకున్నారు. పెంచల్ దాస్ సాహిత్యం సమకూర్చగా మాట వినాలి అంటూ మంచి చెడుల ప్రస్తావనను, అడవిలో పరిస్థితులతో పోలుస్తూ వర్ణించిన విధానం కొత్తగా ఉంది. మాట వినకపోతే ఏదైనా జరగొచ్చు అనే అర్థం వచ్చేలా సుతిమెత్తని విసుర్లు చాలా ఉన్నాయి.
తగిలినోడు మొగుడు కాదు తగరము బంగారు కాదు లాంటి చమక్కులు రాశారు. లిరికల్ వీడియో అయినప్పటికీ కొన్ని విజువల్స్ పొందుపరిచారు. రఘుబాబు, సునీల్, సుబ్బరాజు, కబీర్ సింగ్ తదితరులు పవన్ తో పాటు దరువుకి డాన్స్ చేస్తూ కనిపించరు.
ఆస్కార్ విజేత కీరవాణి స్వరపరిచిన మాట వినాలి వినే కొద్దీ ఛార్ట్ బస్టర్ అయ్యేలా ఉంది. హడావిడి లేకుండా కేవలం ఒక చొన్న వాయిద్యంతో క్యాచీ ట్యూన్ కంపోజ్ చేశారు కీరవాణి. పాటలో సెటప్ చూస్తుంటే ఎక్కడో ఒక కొండ ప్రాంతంలో వీరమల్లు విశ్రాంతి తీసుకుంటుండగా వచ్చే సందర్భంలా ఉంది.
మార్చి 28 విడుదల కాబోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరింత హైప్ నీ పెంచేందుకు ఇది ఎంతవరకు దోహద పడుతుందో వేచి చూడాలి. ఐతే హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ కు తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన భాగాన్ని జ్యోతి కృష్ణ పూర్తి చేస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
This post was last modified on January 17, 2025 11:17 am
టాలీవుడ్ హీరోల్లో నానికి ఉన్న క్రెడిబిలిటీనే వేరు. ప్రతి హీరోకూ కెరీర్లో ఫ్లాపులు తప్పవు కానీ.. నాని కెరీర్ సక్సెస్…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం బిజీబిజీగా గడిపారు. ఓ వైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, మరోవైపు…
ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కీలక మార్పును చేపట్టింది. జట్టును ముందుండి నడిపించిన రిషభ్ పంత్ స్థానాన్ని…
జయకేతనం పేరిట జనసేన ఆవిర్బావ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…
దర్శకధీర రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పిన కల లాంటి ప్రాజెక్టు మహాభారతం. చాలా పెద్ద స్కేల్ మీద టాలీవుడ్ టాప్…
తెలుగు నేలలో సినిమా రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు ఒకేసారి చట్టసభలకు ఎంపికయ్యారు. ఏపీ శాసన మండలి సభ్యుడిగా జనసేన…