గత కొన్నేళ్లుగా టాలీవుడ్ డబ్బింగ్ సినిమాలకొచ్చిన అతి పెద్ద సమస్య ఒరిజినల్ టైటిల్ యధావిధిగా పెట్టడం. వెట్టయన్, కంగువ, వలిమై, తలైవి, తంగలాన్ తదితర పదాలకు అర్థం తెలియకుండానే జనాలను థియేటర్లకు రమ్మన్నారు దర్శక నిర్మాతలు. వీటిలో అధిక శాతం బాక్సాఫీస్ దగ్గర పోయినవే.
ఒకప్పుడు కాదల్ దేశం అంటే ప్రేమ దేశం, నాయగన్ అంటే నాయకుడు, ముదలవన్ అంటే ఒకే ఒక్కడు, మిన్సార్ కనువు అంటే మెరుపు కలలు ఇలా స్వచ్ఛమైన తెలుగు టైటిల్స్ లో కనిపించేది. రాను రాను ప్యాన్ ఇండియా ట్యాగ్ అడ్డం పెట్టుకుని తమిళ పేర్లనే కొనసాగించడం బాషా ప్రేమికుల ఆగ్రహానికి కారణం అయ్యింది.
వచ్చే నెల విడుదల కాబోతున్న విడాముయార్చికి తెలుగులో పట్టుదలగా నామకరణం చేశారు. సంతోషించాల్సిన విషయం ఇది. గతంలో ఇదే అజిత్ తునివుని తెగింపుగా వదిలారు. ఇది శుభపరిణామం. అందరూ ఇదే ధోరణి ఫాలో కావడం చాలా అవసరం. ఆ మధ్య కార్తీ సత్యం సుందరంకు పేరు ఎంత ప్లస్ అయ్యిందో చెప్పనక్కర్లేదు.
ఆ మాత్రం ఆదరణ దక్కించుకుందంటే టైటిల్ త్వరగా కనెక్ట్ అవ్వడం వల్లే. ఒరిజినల్ లో నోరు తిరగనంత కష్టంగా ఉంటుంది. సో ఇకపై డబ్బింగులు తీసుకొచ్చేటప్పుడు ఈ విషయంలో చొరవ తీసుకోవడం జరగాలి. లేదంటే అనువాదాల కథ మళ్ళీ మొదటికే వస్తుంది.
ఫిబ్రవరి 6 పట్టుదల థియేటర్లలో అడుగు పెట్టనుంది. అజిత్, త్రిష జంటగా నటించగా యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతికి అనుకున్నారు కానీ సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ తొలగిపోవడంతో భారీ ఎత్తున రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది.
రెండు నెలల గ్యాప్ తో ఏప్రిల్ 10 అజిత్ మరో ప్యాన్ ఇండియా మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ వచ్చేస్తుంది. ఇది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందింది. రెండు సినిమాలు తెలుగులో సమాంతరంగా రిలీజ్ కాబోతున్నాయి. పెద్దగా పోటీ లేదు కాబట్టి థియేటర్ కౌంట్ గట్టిగానే దొరికేలా ఉంది.
This post was last modified on January 16, 2025 3:55 pm
నిన్న డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ బాగా ఎమోషనల్ అయిపోతూ సినిమాను చంపొద్దంటూ, సోషల్ మీడియాలో మరీ…
ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో కీలక విభాగం అయిన సీఐడీకి చీఫ్…
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.…
కెరీర్ ప్రారంభంలో లవ్ స్టోరీలే చూపించి తొలిప్రేమ తప్ప మిగిలిన వాటితో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన దర్శకుడు వెంకీ అట్లూరి…
నిజమే… నిన్నటిదాకా సినిమాల్లో మునిగిపోయి పవర్ స్టార్ గానే జనానికి తెలిసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్దగా…
పెట్టుబడుల వేటలో భాగంగా విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గడ్డ నుంచి తీపి కబురు…