పుష్ప-2 విడుదలై 40 రోజులు దాటిపోయింది. రిలీజైన ఇన్ని రోజుల తర్వాత థియేటర్లలో సినిమా ఉండడమే గగనం. కానీ ఇప్పటికీ ఈ చిత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు నామమాత్రమే కానీ.. హిందీలో మాత్రం ఇప్పటికీ మంచి వసూళ్లతో సాగిపోతోంది. కొత్త సినిమాలైన గేమ్ చేంజర్, ఫతేలకు దీటుగా ఈ సినిమా వసూళ్లు ఉంటున్నాయి.
ఇప్పటికీ రోజూ రెండు మూడు కోట్లకు తక్కువ కాకుండా కలెక్షన్లు రాబడుతోంది హిందీ వెర్షన్. శుక్రవారం నుంచి వసూళ్లు ఇంకా పెరగబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్సులు ఈ శుక్రవారం టికెట్ల ధరను రూ.112కు పరిమితం చేస్తున్నాయి. ఇది అన్ని సినిమాలకూ కలిసి వచ్చే విషయమే. ముఖ్యంగా ‘పుష్న-2’ ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
20 నిమిషాల అదనపు నిడివితో పుష్ప-2 రీలోడెడ్ వెర్షన్ శుక్రవారమే రిలీజవుతోంది. దీంతో ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో మళ్లీ ఆసక్తి పుడుతోంది. చూసిన వాళ్లు, చూడని వాళ్లు థియేటర్లకు వెళ్లబోతున్నారు. గత కొన్ని రోజులతో పోలిస్తే శుక్రవారం ‘పుష్ప-2’ ఎక్కువ వసూళ్లు రాబట్టేలా ఉంది. వీకెండ్లో కూడా దీని ప్రభావం బాగానే ఉండొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మరీ ప్రభావం ఉండకపోవచ్చు కానీ.. హిందీలో మాత్రం ‘పుష్ప-2’ తగ్గేదే లేదన్నట్లే దూుకెళ్తోంది.
హిందీ వెర్షన్ 8వ వారంలోనరూ కొత్త సినిమాలకు దీటుగా వసూళ్లు రాబడితే అది అద్భుతమే అవుతుంది. కాబట్టి పుష్ప-2 రన్ గురించి చాన్నాళ్ల పాటు మాట్లాడుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. హిందీలో అసలు పబ్లిసిటీ అన్నదే లేకుండా ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తూ దూసుకెళ్తోంది. ‘పుష్ప-2’ వసూళ్లు ఇప్పటికే రూ.1800 కోట్ల మార్కును దాటేసి నట్లు మేకర్స్ ప్రకటించారు.
This post was last modified on January 16, 2025 2:39 pm
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…