టాలీవుడ్ పెద్ద ఫ్యామిలీస్‌లో మంచు వారిది ఒకటి. స్టేచర్ పరంగా మోహన్ బాబు ఎవరికీ తక్కువేమీ కాదు. ఆయన నటనా సామర్థ్యం, ఘనతల గురించి ఎంత చెప్పినా తక్కువే. కాకపోతే ఆయన వారసులు ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడం వల్ల మంచు ఫ్యామిలీకి ఉండాల్సినంత విలువ లేకపోయింది. ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే వాల్యూ. అది లేకపోవడం వల్ల మంచు వారసులు పరిశ్రమలో కొంచెం ఇబ్బంది పడుతుంటారన్నది వాస్తవం.
ఐతే మిగతా వాళ్లతో పోలిస్తే.. మనోజ్ మాత్రం టాలీవుడ్ హీరోలతో చాలా కలివిడిగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. అతిథి పాత్రల్లాంటివి చేయమంటూ మొహమాటం లేకుండా చేస్తాడు. ‘వేదం’లో తన పాత్ర నిడివి తక్కువే అయినా సరే.. అందులో నటించాడు. మల్టీస్టారర్లు చేయడం పట్ల కూడా అతడికి బాగానే ఆసక్తి ఉంది. కానీ సరైన కాంబినేషన్ కుదర్లేదు.
ఐతే ఇప్పుడు మనోజ్ స్వయంగా ఓ మల్టీస్టారర్ కోసం ఓపెన్ ప్రపోజల్ పెట్టాడు సాయిధరమ్ తేజ్ ముందు. గురువారం తేజు పుట్టిన రోజు. ఈ సందర్భంగా అతణ్ని ప్రేమగా బాబాయ్ అని సంబోధిస్తూ ట్వీట్ పెట్టాడు మనోజ్. తేజు పుట్టిన రోజు నాడే మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘బిల్లా రంగా’ 38వ వార్షికోత్సవం జరుపుకుంటున్న విషయాన్ని అతను గుర్తు చేశాడు. అక్టోబరు 15న విడుదల అంటూ అప్పటి సినిమా పోస్టర్ కూడా షేర్ చేశాడు. ఇది షేర్ చేయడం ద్వారా తాను ఏం చెప్పదలుచుకున్నానో తేజు అర్థం చేసుకోవాలని.. ‘నేనైతే రెడీగా ఉన్నా. మరి నీ సంగతేంటి’ అని ప్రశ్నించాడు మనోజ్.
ఇంతకుముందు మంచు మనోజ్ నటించిన ‘గుంటూరోడు’ సినిమా వేడుకలో పాల్గొన్న తేజు.. తామిద్దరం ఎప్పట్నుంచో ‘బిల్లా రంగా’ రీమేక్‌లో నటించడాలనుకుంటున్నామని వెల్లడిస్తూ.. దాని సంగతేంటని మనోజ్‌ను ప్రశ్నించాడు. ఆ రీమేక్‌ను సరిగా డీల్ చేయగలిగే దర్శకుడు దొరికినపుడు కచ్చితంగా చేద్దామని మనోజ్ అన్నాడు. మరి ఇప్పుడు మనోజ్ ఈ రీమేక్‌లో నటించడానికి రెడీ అన్నట్లు సంకేతాలిచ్చాడు. మరి తేజు ఏమంటాడో చూడాలి.
This post was last modified on October 15, 2020 5:25 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…