తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు హైదరాబాద్‌లో ఎంత పెద్ద స్థాయిలో నిలబడుతోందో తెలిసిందే. ఇండియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీల్లో ఒకటిగా టాలీవుడ్ ఎదిగింది. భాగ్య నగరంలో ఈ ఇండస్ట్రీ ఈ స్థాయికి చేరుకోవడంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్ర అత్యంత కీలకం అనడంలో సందేహం లేదు. మద్రాసు నగరం మనకూ సొంతమైన సమయంలో అక్కడే మొదలైన తెలుగు సినీ పరిశ్రమ.. ఆ సిటీ తమిళనాడులో భాగం అయ్యాక కూడా అక్కడే కొనసాగుతున్న సమయంలో అక్కినేని వేసిన ముందడుగు.. మొత్తం కథను మార్చేసింది.
ఆయన కోసం నిర్మాతలు హైదరాబాద్ రావడం, ఇక్కడే చిత్రీకరణలు జరపడం.. ఆ తర్వాత ఇండస్ట్రీ మొత్తం నెమ్మదిగా హైదరాబాద్ వచ్చేయడం.. ఇదంతా ఒక చరిత్ర. హైదరాబాద్‌లో అడుగు పెట్టి కొండలు గుట్టలతో నిండిన బంజారా హిల్స్‌లో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టి తెలుగు సినీ పరిశ్రమలో ఒక విప్లవానికి తెర తీసిన ఘనత ఏఎన్నార్‌కే చెందుతుంది.
ఈ విప్లవం మొదలై 50 ఏళ్లు పూర్తి కానుండడం విశేషం. అన్నపూర్ణ స్టూడియో 50వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్న వేళ.. అక్కినేని కుటుంబం ఏడాది పొడవునా సంబరాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా నాగ్ ఒక ప్రత్యేకమైన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోకు ఏఎన్నార్ ఎలా శ్రీకారం చుట్టింది.. దీని నిర్మాణం, ఎదుగుదల కోసం ఆయన ఎంత కష్టపడిందీ ఆయనీ వీడియోలో వివరించారు.
స్టూడియో అంటే తన తల్లిదండ్రులకు ఎంత ఇష్టమో.. ఇందులో ప్రతి ప్రదేశాన్నీ వాళ్లిద్దరూ ఎంతగా ప్రేమించేవారో నాగ్ చెప్పారు. అలాగే అన్నపూర్ణ సిబ్బందిలో ఎవ్వరినీ తాము ఉద్యోగులుగా చూడమని.. వాళ్లంతా ఫ్యామిలీ అని.. ప్రతి సంవత్సరం స్టూడియో మొదలైన సంక్రాంతి రోజు వారితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేయడం ఏఎన్నార్‌కు అలవాటని.. తాము కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని నాగ్ వెల్లడించారు. ఈ బ్యూటిఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.
This post was last modified on January 15, 2025 3:32 pm
పండక్కు రిలీజై హిట్టు కొట్టిన రెండు సినిమాల్లో చైల్డ్ ఎలిమెంట్ కీలక పాత్ర పోషించడాన్ని కొట్టిపారేయలేం. ముందుగా డాకు మహారాజ్…
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్యర్య రాజేష్ కే. గ్లామర్ పరంగా…
గత ఏడాది ‘కల్కి: 2898 ఏడీ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు అతి…
ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్‌లో ఆలస్యం జరిగి.. 2013…
ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ పూట భారీ కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచి పోయిన…
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది.…