Movie News

కల్కి పార్ట్ 2 : 2026 లోనే రిలీజ్!

గత ఏడాది ‘కల్కి: 2898 ఏడీ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు అతి పెద్ద హిట్ ఇదే అయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ రూపొందించిన ఈ సైఫై ఫాంటసీ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో ‘కల్కి-2’ మీద భారీగా అంచనాలు పెరిగాయి.

ఐతే ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుంది అనే విషయాల్లో కొంత అయోమయం నెలకొంది. ప్రస్తుతం ప్రభాస్.. ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’ సినిమాల్లో సమాంతరంగా నటిస్తున్నాడు. మరోవైపు ‘స్పిరిట్’ మూవీని వీలైనంత త్వరగా మొదలుపెట్టడానికి సందీప్ రెడ్డి వంగ చూస్తున్నాడు. ఇంకోవైపు ‘సలార్-2’ మూవీ టీం కూడా వెయిటింగ్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ కీలక ప్రకటన చేశారు.‘కల్కి-2’ వచ్చే ఏడాదే విడుదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. అంతే కాక పార్ట్-2లో ముఖ్య పాత్రల తీరు ఎలా ఉంటుందో కూడా చెప్పారు. ‘కల్కి’లో తక్కువ స్క్రీన్ టైంకు పరిమితమైన కమల్ రెండో భాగంలో సినిమా అంతటా కనిపిస్తారని తెలిపారు. ‘‘కల్కి-2 వచ్చే ఏడాదే విడుదలవుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్ మొదలుపెడతాం.

రెండో భాగం అంతా కమల్ హాసనే ఉంటారు. ఆయనకు, ప్రభాస్‌కు మధ్య రసవత్తరమైన సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్ర కూడా పార్ట్-2లో కీలకంగా ఉంటుంది. ఈ ముగ్గురే సినిమాకు మెయిన్. దీపిక పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. కథ ప్రకారం కొత్త పాత్రలు ఉండే అవకాశం తక్కువే’’ అని అశ్వినీదత్ తెలిపారు.

ఇక దర్శకుడు, తన అల్లుడు నాగ్ అశ్విన్ గురించి దత్ మాట్లాడుతూ.. ‘‘మహానటి సినిమా చేస్తునన సమయంలోనే తన ప్రతిభ ఏంటో అర్థమైంది. అంత పెద్ద సినిమాను ఎలాంటి తడబాటు లేకుండా తీశాడు. అతడికి జీవితంలో ఓటమన్నదే ఉండదని అనుకుంటున్నా. తన ఆలోచన తీరు, సినిమాలు తీసే విధానం అంత గొప్పగా ఉంటాయి’’ అని దత్ అన్నారు.

This post was last modified on January 15, 2025 3:23 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

2 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

4 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

4 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

6 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

7 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

8 hours ago