Movie News

అనిల్ రావిపూడి పట్టుదల… సంక్రాంతికి కాసుల కళ

ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల కావడమనే సంప్రదాయం 2023లో మైత్రి సంస్థ విజయవంతంగా అమలు చేసింది కానీ ఈసారి దిల్ రాజు అలాంటి రిస్క్ చేస్తారా అనే అనుమానం నెల రోజుల ముందు వరకు ఉండేది. ఎందుకంటే గేమ్ ఛేంజర్ ప్యాన్ ఇండియా మూవీ.

పైగా మూడేళ్లు నిర్మాణంలో ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ సోలో బొమ్మ. శంకర్ టాలీవుడ్ డెబ్యూ. సో సంక్రాంతికి వస్తున్నాంని దానితో సమాంతరంగా రిలీజ్ చేయాలా వద్దానే సందిగ్ధం కొన్నిరోజులు దిల్ రాజు టీమ్ ని వెంటాడిన మాట వాస్తవం. చివరికి టైటిల్ లోనే పట్టుదల చూపించిన అనిల్ రావిపూడి మాటే నెగ్గింది.

కట్ చేస్తే సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ తోనే దుమ్ము దులిపేసింది. ఏదో పర్వాలేదనే టాక్ వచ్చినా చాలనుకుంటే ఏకంగా బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ తో ఏబీసీ తేడా లేకుండా అన్ని సెంటర్లలో వసూళ్ల జాతర మొదలుపెట్టింది. మూడు రోజుల క్రితం వచ్చిన డాకు మహారాజ్ కు దక్కిన మాస్ మద్దతు ఒక్కసారిగా వెంకటేష్ వైపు షిఫ్ట్ అయిపోయింది.

ఫ్యామిలీస్ తండోపతండాలుగా సంక్రాంతికి వస్తున్నాంకి టికెట్లు తెంపుతున్నారు. తక్కువ స్క్రీన్లు ఉండే కేంద్రాల్లో దీని ఓవర్ ఫ్లోస్ పోటీ సినిమాలను హౌస్ ఫుల్ చేయడం అతిశయోక్తి కాదు. ఇదంతా ఊహించే అనిల్ రావిపూడి ఎలాగైనా పండక్కే రావాలని పంతం పూనాడు.

దీంతో గేమ్ ఛేంజర్ ఫలితం పట్ల దిగాలుగా అనిపించిన దిల్ రాజు టీమ్ లో ఒక్కసారిగా రెట్టింపు జోష్ వచ్చింది. సాయంత్రానికే పటాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. యునానిమస్ రిపోర్ట్స్ చూసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

షోలకు పెరుగుతున్న డిమాండ్ చూసి ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ దూకుడు ఎన్ని రోజులు ఉంటుందో ఇప్పుడే అంచనాకు రాలేం. పుష్ప 2 నెలకు పైగానే అదరగొట్టింది. దగ్గరలోనే కొత్త రిలీజులు లేకపోవడం సంక్రాంతికి వస్తున్నాంకు ఖచ్చితంగా పెద్ద ప్రయోజనం కలిగించనుంది. ఎంతనేది వేచి చూడాలి.

This post was last modified on January 15, 2025 10:37 am

Share

Recent Posts

వాస్తవంలోకి రావయ్యా విశాల్

గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…

32 minutes ago

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కన్నుమూత

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…

52 minutes ago

రెండు కిక్ ఇచ్చాయి… ఒకటి షాక్ కొట్టింది

నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…

1 hour ago

బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫలితం దక్కలేదు

మొన్న గురువారం విడుదలైన సినిమాల్లో మారెమ్మ కూడా ఉంది. మాములుగా అయితే స్టార్ కాస్టింగ్ లేని ఇలాంటి మూవీని జనం…

3 hours ago

పీడకలగా మారుతున్న పార్ట్ 2 ఫలితాలు

ఒక హిట్ మూవీకి కొనసాగింపు ఉండాలనుకోవడం మంచిదే. కథ డిమాండ్ చేసినప్పుడు, దానికి అనుగుణంగా దర్శకులు తమ క్రియేటివిటీని జోడించి,…

4 hours ago

స్థానిక ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ముచ్చెమటలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడింది. బీజేపీ కంచుకోటల్లో…

4 hours ago