Movie News

మన్మథుడు భామ పేరు.. మార్మోగుతోంది

అన్షు.. ఈ ముంబయి భామ తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు. అందులో రెండో సినిమా పెద్ద డిజాస్టర్. కానీ తెలుగు ప్రేక్షకులు అంత సులువుగా ఈ పేరును మరిచిపోలేరు. అందుక్కారణం.. తొలి చిత్రం ‘మన్మథుడు’తో ఆమె వేసిన ముద్ర అలాంటిది మరి. అందులో ఆమెది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. ఓ ముప్పావు గంట కనిపించే పాత్ర అది.

అయినా తన క్యూట్ లుక్స్, యాక్టింగ్‌తో కుర్రకారును కట్టి పడేసింది. ఆమె మీద తీసిన రెండు పాటలూ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల చెవుల్లో మార్మోగుతుంటాయి. కంళ్లకు ఎంతో ఇంపుగా అనిపిస్తాయి. ఐతే అన్షు రెండో చిత్రం ‘రాఘవేంద్ర’ డిజాస్టర్ కావడంతో ఆమె టాలీవుడ్ నుంచి కనుమరుగైపోయింది. తమిళంలో ఓ సినిమా చేస్తే అక్కడా సరైన ఫలితం రాకపోవడంతో అన్షు ఇండస్ట్రీకి దూరమైపోయింది.

రెండు దశాబ్దాల పాటు అన్షు ఎక్కడా కనిపించలేదు. ఐతే ఈ మధ్య ‘మన్మథుడు’ రీ రిలీజ్ సందర్భంగా ఆన్ లైన్లో అభిమానులతో ముచ్చటించినపుడు బాగా చిక్కిపోయి గుర్తు పట్టనట్లు కనిపించిన అన్షును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు సడెన్‌గా ఆమె రీఎంట్రీ ఇస్తుండడం పెద్ద షాక్. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అన్షు కీలక పాత్రే చేస్తోంది.

హీరో తండ్రిగా చేస్తున్న రావు రమేష్‌కు జోడీగా ఆమె నటిస్తుండడం విశేషం. హీరోయిన్‌గా చేసిన 20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ, పైగా తండ్రి పాత్రకు జోడీ అంటే తల్లి పాత్రలకు మారిపోయిందని అనుకుంటాం కానీ.. అన్షుది అలాంటి పాత్ర కాదు. ఆమె దాదాపు హీరోయిన్ తరహా గ్లామర్ పాత్రే చేస్తోంది. తన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమవుతోంది.

టీజర్ ఎంటర్టైనింగ్‌గా ఉండడానికి తోడు.. టీజర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు త్రినాథరావు చేసిన వివాదాస్పద కామెంట్ వల్ల అన్షు పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. అందరూ తన గురించి చర్చించుకంటున్నారు. ఈ సినిమా, పాత్ర క్లిక్ అయితే అన్షుకు ఇలాంటి రోల్స్ మరిన్ని రావడం.. టాలీవుడ్లో ఆమె బిజీ అవ్వడం ఖాయం.

This post was last modified on January 13, 2025 5:21 pm

Share
Show comments
Published by
Kumar
Tags: AnshuMazaka

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

32 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago