అయాన్ ముఖర్జీ అంటే తెలుగు ప్రేక్షకులకు ఇంతకు ముందు సుపరిచితమైన పేరు కాదు. జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో వార్ 2కి దర్శకుడిగా ఎంపికయ్యాక సినీ ప్రియులకు రిజిస్టరయ్యాడు. బాలీవుడ్లోనే అత్యంత ఖరీదైన మల్టీస్టారర్ గా రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా ఆగస్ట్ 14 విడుదల కానుంది.
ఇక అసలు విషయానికి వద్దాం. ఇతని రెండో సినిమా 2013లో వచ్చిన ఏ జవానీ హై దివాని ఇటీవలే రీ రిలీజయ్యింది. పదకొండేళ్ల క్రితం విడుదలైనప్పుడు భారీ విజయం నమోదు చేసుకుని 188 కోట్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రన్బీర్ కపూర్, దీపికా పదుకునే జోడికి చాలా పేరు తీసుకొచ్చింది.
కట్ చేస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత ఏ జవానీ హై దివానిని రీ రిలీజ్ చేస్తే పది రోజులుగా బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకుంటోంది. అప్పుడు మిస్ అయిన డబుల్ సెంచరీని పూర్తి చేసింది. ఇప్పటిదాకా 12 కోట్ల 50 లక్షలు వసూలు చేసి ఫస్ట్ రన్ లో సాధ్యం కానీ రెండు వందల కోట్ల మైలురాయిని అందుకుంది.
ఇప్పటికీ నగరాలు, పట్టణాల మల్టీప్లెక్సుల్లో వీకెండ్ టికెట్లు దొరకడం లేదు. బాలీవుడ్ రీ రిలీజుల్లో ఈ మధ్యకాలంలో ఇంత భారీ స్పందన దేనికీ రాలేదు. తాజాగా వచ్చిన కహో నా ప్యార్ హై కూడా వెనుకబడే ఉంది. ఎలాగూ గేమ్ ఛేంజర్, ఫతే తప్ప కొత్తవి లేవు కాబట్టి రన్బీర్ మూవీకి కాసులు ఇంకా వస్తాయి.
ముఖ్యంగా యూత్ ఏ జవానీ హై దివానిని ఎగబడి చూస్తున్నారు. ఎలాంటి అసభ్యత లేని క్లీన్ రొమాన్స్, ఛార్ట్ బస్టర్ పాటలు, రన్బీర్ దీపిక కెమిస్ట్రీ మాములుగా పేలలేదు. 2013 స్థాయిలో రెస్పాన్స్ రావడం చూసి నిర్మాత కరణ్ జోహార్ ఆనందం మాములుగా లేదు. ఈ మధ్య వరస ఫ్లాపులతో కుదేలవుతున్న ఇతనికి పెద్ద రిలీఫ్ దక్కింది.
దేవర హిందీ వెర్షన్ డబ్బులు తేవడం తప్ప పెద్దగా ఆనందం మిగలని టైంలో ఇదిస్తున్న ఊరట అంతా ఇంతా కాదు. ఎంత సక్సెస్ అయినా, కల్ట్ స్టేటస్ దక్కించుకున్నా ఏ జవానీ హై దివాని స్పూర్తితో చాలా సినిమాలొచ్చాయి కానీ ఇది ఇతర భాషల్లో రీమేక్ కాకపోవడం గమనార్షం.
ఏ జవానీ హై దివాని భారతదేశంలో రీ రిలీజ్ అయిన సినిమాల్లో తలపతి విజయ్ నటించిన గిల్లి (26.50 కోట్లు), తుమ్బాడ్ (37.34 కోట్లు) తర్వాత మూడవ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది.
This post was last modified on January 13, 2025 4:58 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ-మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై కనిపించిన పరిస్థితి ఇటీవల కాలంలో ఎక్కడా లేదు. ఎప్పుడో ప్రమాణస్వీకార…
+ ``పండక్కి సెలవులు పెట్టారు. ఇప్పుడు ఎక్కడున్నారు. సరే.. ఎక్కడున్నా తక్షణమే వచ్చేయండి!`` + ``మీ సెలవులు రద్దు చేస్తున్నాం.…
ఇండియా క్రేజీ మల్టీస్టారర్స్ లో ఒకటిగా చెప్పుకుంటున్న వార్ 2 విడుదల ఇంకో ఎనిమిది నెలల్లో జరగనుంది. ఆగస్ట్ 14…
దర్శకుడు త్రినాథరావు పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన కొత్త చిత్రం ‘మజాకా’…
అన్షు.. ఈ ముంబయి భామ తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు. అందులో రెండో సినిమా పెద్ద డిజాస్టర్. కానీ…
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పట్టణం మహా కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా…