నిన్న సందీప్ కిషన్ మజాకా టీజర్ విడుదలయ్యింది. కొన్ని నెలల ముందు సంక్రాంతి రిలీజనుకున్నారు కానీ పోటీ దృష్ట్యా వాయిదా వేసుకుని ఫిబ్రవరి 27కి వెళ్లిపోయారు. రవితేజకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక దర్శకుడు త్రినాధరావు నక్కిన చేసిన సినిమా ఇది. నిజానికిది చిరంజీవితో ప్లాన్ చేసుకున్న చిత్రం.
రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ కథను ముందు మెగాస్టార్ కే వినిపించాడు. పగలబడి నవ్వుతూ విన్న చిరు సానుకూలంగా స్పందించారు కానీ రకరకాల కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. కట్ చేస్తే అదే పాత్రని రావు రమేష్ కి అనుగుణంగా పూర్తి వినోదాత్మకంగా మార్చేశారు. అదే మజాకా.
ఇదంతా ప్రెస్ మీట్ లో భాగంగా మజాకా బృందం పంచుకున్న విశేషమే. టీజర్ చూశాక ఎవరికైనా కలిగే అభిప్రాయం ఒకటే. చిరంజీవి ఇది వద్దనుకోవడం ముమ్మాటికీ సరైన నిర్ణయమే. ఎందుకంటే ఆయన ఇమేజ్, మార్కెట్ దృష్ట్యా కొడుకు ఉండగా మరో మహిళకు లైన్ వేసి పెళ్లి చేసుకోవాలనుకునే అల్లరి పాత్ర సూటవ్వదు.
ఒకవేళ ఒప్పుకుని ఉంటే మార్పులు చేసేవారేమో కానీ మెయిన్ పాయింట్ అయితే మారదుగా. అందుకే కథ రాసుకున్న టైంలో ప్రసన్న కుమార్ ఎవరినైతే దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేశాడో తిరిగి అదే రావు రమేష్ దగ్గరికి వెళ్లిపోవడం ఫైనల్ ట్విస్ట్. కంటెంట్ ఇప్పుడు వర్కౌట్ అవ్వొచ్చు.
అఫీషియల్ గా టీమ్ చెప్పిన ముచ్చట పక్కనపెడితే ఈ స్టోరీనే చిరంజీవి హీరోగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో చేయాలనే దిశగా స్క్రిప్ట్ పనులు జరిగాయని అప్పట్లో టాక్ వచ్చింది. భోళా శంకర్ ఫలితం చూశాక ఆయన మనసు మార్చుకుని విశ్వంభరకు ఓటేశారని చెప్పుకున్నారు.
అటుఇటు తిరిగి ఎంటర్ టైన్మెంట్ ని హ్యాండిల్ చేయగల త్రినాధరావు చేతికి వచ్చింది. మారుతినగర్ సుబ్రహ్మణ్యంకి మించి రావు రమేష్ కి ఇందులో పెర్ఫార్మన్స్ పరంగా మరో మంచి ఛాన్స్ దొరికింది. ఒకప్పటి నాగార్జున మన్మథుడు హీరోయిన్ అన్షు రెండు దశాబ్దాల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం. ఆమెనే రావు రమేష్ జోడి.
This post was last modified on January 13, 2025 12:30 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…