సినిమాలకు హైప్ తేవడానికి స్టేజ్ మీద కొంచెం ఉత్సాహంగా మాట్లాడేస్తుంటారు టీం మెంబర్స్. ఐతే ఆ మాటలు సరదాగా.. చమత్కారంగా ఉంటే ఓకే కానీ.. హద్దులు దాటితేనే ప్రమాదం. సోషల్ మీడియా కాలంలో ప్రతి మాటా ఆచితూచి మాట్లాడాల్సిందే. చిన్న తేడా వచ్చినా పెద్ద కాంట్రవర్శీ అయిపోతుంది.
సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా లాంటి సూపర్ హిట్లు అందించిన దర్శకుడు త్రినాథ రావు నక్కిన తాజాగా తన కొత్త చిత్రం మజాకా టీజర్ లాంచ్ కార్యక్రమంలో చేసిన ఒక కామెంట్ తీవ్ర వివాదాస్పదం అవుతోంది. మజాకా చిత్రంలో మన్మథుడు ఫేమ్ అన్షు ఒక కీలక పాత్ర చేసింది. టీజర్లో తన పాత్ర బాగానే హైలైట్ అయింది.
ఆమె గురించి త్రినాథరావు మాట్లాడుతూ.. అన్షు ఇప్పుడు ఎలా ఉంది అని ఈవెంట్‌కు హాజరైన అభిమానులను అడుగుతూ.. అలానే ఉందా అన్నాడు. దానికి కొనసాగింపుగా ఆమె సన్నబడింది అని వ్యాఖ్యానించాడు. ఐతే ఈ సినిమాలో పాత్ర చేసేటపుడు ఇలా ఉంటే సరిపోదని బరువు పెరగాలని సూచించినట్లు చెబుతూ ఆయన అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు.
కొంచెం సన్నబడింది. నేనే కొంచెం తిని పెంచమ్మా తెలుగుకి సరిపోదు. కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. పర్లేదు కొంచెం ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ టైంకి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని త్రినాథరావు అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. బరువు పెరగాలని అంటే ఓకే కానీ.. సైజులు పెరగాలి అనడం మాత్రం అభ్యంతరకరమే. ఫ్లోలో అన్నారో ఏమో కానీ.. ఈ వ్యాఖ్యలైతే త్రినాథరావుకు తీవ్ర విమర్శలు తెచ్చిపెడుతున్నాయి.
ఇదే స్పీచ్‌లో అల్లు అర్జున్‌ను త్రినాథరావు అనుకరించడం కూడా చర్చనీయాంశం అయింది. సెకండ్ హీరోయిన్ అంటూ రీతూ వర్మ గురించి చెప్పబోయి ఆమె పేరు మరిచిపోయినట్లు నటిస్తూ గ్యాప్ తీసుకుని వాటర్ బాటిల్ అడిగాడు త్రినాథరావు. పుష్ప-2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును మరిచిపోయి దాన్ని కవర్ చేయడానికి ఇలాగే ట్రై చేసి దొరికిపోయిన సంగతి తెలిసిందే.
This post was last modified on January 13, 2025 11:01 am
కొద్ది రోజుల క్రితం రగులుకున్న మాయదారి కార్చిచ్చు.. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మహానగరం ఇప్పుడు మరుభూమిగా మార్చింది. సంపదతో తులతూగుతూ..…
పార్టీ పిరాయింపుల వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వావాదానికి దారి తీసింది. ముగ్గురు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ,…
ఎప్పుడూ చాలా హుషారుగా కనిపించే తమిళ హీరో విశాల్.. వారం కిందట తన సినిమా ‘మదగజరాజా’ ప్రమోషనల్ ఈవెంట్లో కనిపించిన…
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు…
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్…
అగ్రరాజ్యం అమెరికాలో ధనవంతులు నివసించే ప్రాంతం అది! కడుక్కున్న కాళ్లతో అక్కడ అడుగులు వేసినా ముద్రపడతాయేమో.. మట్టి అంటుతుందేమో.. అని…