బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు భిన్నమైన ఆదేశాలు ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఏపీలో బెనిఫిట్, ప్రీమియర్ షోల విషయంలో హైకోర్టు సానుకూల ఆదేశాలు ఇచ్చింది. తప్పేంటని ప్రశ్నించింది. ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణాలు చేయడం మానేస్తామా? అని పిటిషనర్‌ను నిలదీసింది. ఇక, ఇదే వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు భిన్నమైన ఆదేశాలు ఇచ్చింది.
ప్రేక్షకులే ముందు! అన్న విధానాన్ని పాటించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. “ప్రీమియర్ షోల కు, టికెట్ ధరలను పెంచేందుకు మీ ప్రభుత్వం వ్యతిరేకమని చెప్పిన తర్వాత కూడా బెనిఫిట్ షోలను ఎందుకు వేస్తున్నారు? టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారు? ” అని కోర్టు ప్రశ్నించింది. అంతా మీ ఇష్టమేనా? అని నిలదీసినట్టు తెలిసింది. బెనిఫిట్ షోలను ఆపాలని హైకోర్టు సూచించింది. అంతేకాదు.. ప్రేక్షకుల భద్రతకు ప్రభుత్వాలు పెద్దపీట వేయాలని కోరింది.
నిర్మాతల పైనా తెలంగాణ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎక్కువ బడ్జెట్‌తో సినిమాలు రూపొందించమని ఎవరు అడిగారు? సగటు ప్రేక్షకుడికి వినోదం అందించేందుకు అంతంత బడ్జెట్ ఎందుకని ప్రశ్నించింది. అంతేకాదు.. ఎక్కవ సొమ్ములు ఖర్చు పెట్టి.. ఆ సొమ్మును సగటు ప్రేక్షకుడి నుంచి రాబట్టుకునే ప్రయత్నాలు మానుకోవాలని సునిశితంగా మందలించింది.
ఈ విషయంపై మరోసారి ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్న తెలంగాణ హైకోర్టు.. ఇప్పటికైతే.. భవిష్యత్తులో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇచ్చే ముందు ప్రేక్షకుల భద్రతను కూడా పట్టించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. ప్రేక్షకులే అందరికన్నా ప్రాధాన్యం ఉన్న వ్యక్తులు అని వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on January 10, 2025 3:57 pm
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆకస్మికం గా పర్యటించారు. వాస్తవానికి…
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటన సంచలనం రేపింది.…
స్వలింగ వివాహాలకు చట్టబద్ధతకు నో.. తేల్చేసిన సుప్రీంస్వలింగ వివాహాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై దాఖలైన పిటిషన్లపై కీలక…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే విజన్కు పరాకాష్ఠ. ఆయన దూరదృష్టి.. భవిష్యత్తును ముందుగానే ఊహించడం.. దానికి తగిన ప్రణాళికలు వేసుకుని…
తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో…