తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హీరోల సినిమాలు రిలీజైనప్పుడు ఐకానిక్ సెలబ్రేషన్స్ అంటే ముందు గుర్తొచ్చే పేరు హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్. సుదర్శన్, దేవి, సంధ్య, సప్తగిరి తదితర థియేటర్లలో అర్ధరాత్రి బెనిఫిట్ షోల టైంలో జరిగే కోలాహలం మాములుగా ఉండదు. డీజే సౌండ్లు, ఊరేగింపులు, బాణాసంచా, పెరేడ్లు అబ్బో హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఇటీవలే జరిగిన పుష్ప 2 దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు, ప్రభుత్వం నిబంధనలు కఠినతనం చేయడంతో చాలా ఆంక్షల మధ్య ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నారు. దానికి తోడు మిడ్ నైట్ ప్రీమియర్లకు తెలంగాణ సర్కారు అనుమతి ఇవ్వకపోవడం మరో షాక్.
మూడు సినిమాల మీద దీని ప్రభావం ఉంటుంది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం కోసం రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ ఫ్యాన్స్ పోటాపోటీగా సంబరాలు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు వీటిని పరిమితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సెక్యూరిటీ కారణాల వల్ల ఈసారి ఏ చిన్న పొరపాటుకి తావిచ్చే ఉద్దేశంలో పోలీసులు లేరు. మరీ మౌనంగా చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు కానీ థియేటర్ బయట మాత్రం ఎక్కువ హల్చల్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఒకవేళ చేయాలని చూసినా వెంటనే దానికి అనుగుణంగా చర్యలు ఉండే అవకాశముంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
కానీ ఏపీలో ఎలాంటి సమస్య లేదు. రాత్రి ఒంటి గంటకు అన్ని కేంద్రాల్లో ప్రీమియర్లు పడుతున్నాయి. మరో బాధ ఏంటంటే క్రాస్ రోడ్స్ లో మొదటి షో పడేలోపే ఆంధ్రప్రదేశ్ నుంచి టాక్ బయటికి వచ్చేస్తుంది. రివ్యూలు, ట్వీట్లు హోరెత్తిపోతాయి. కొందరు అత్యుత్సాహంతో పెట్టే థియేటర్ వీడియోలు మరింత కలవరానికి గురి చేస్తాయి. అంటే ఫస్ట్ షో అనుభూతి దక్కించుకునే లోపే మొత్తం రిపోర్ట్ బయటికి వచ్చేస్తుందన్న మాట. ఇదంతా తాత్కాలికమే కావొచ్చు. సెలబ్రేషన్స్ పరిమితంగానే జరగొచ్చు. భవిష్యత్తులో మార్పు వస్తుందనే గట్టి నమ్మకం సినీ ప్రియుల్లో ఉంది. అది జరగాలనే అందరి కోరిక.
This post was last modified on January 9, 2025 3:56 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…