అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ – రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ మొదలైపోయింది. గత వారం ట్రైలర్ చూశాక దీని మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దానికి తగ్గట్టే గంటా పది నిమిషాల మొదటి భాగంలో ఇద్దరూ కలిసి భలే కబుర్లు పంచుకున్నారు. మొదటగా నట వారసత్వం గురించి టాపిక్ రాగా దాని వల్ల పడిన ఇబ్బందుల గురించి చర్చించుకోవడం సరదాగా అనిపించింది. బాలయ్య పదే పదే బ్రో అని పిలవమని చెప్పినా చరణ్ వెనుకాడుతూ బ్రో సార్ అని సంబోధించడం, పరస్పరం కవ్వించుకోవడం ఫన్నీగా జరిగిపోయింది.
చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తో చరణ్ అనుబంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. చరణ్ చిన్నతనంలో ఒకే ఒక్సారి నాన్నతో దెబ్బలు తిన్న జ్ఞాపకం, దానికి కారణమైన వ్యక్తి ప్రస్తావన కొత్తగా ఉంది. 1992లో హైదరాబాద్ వచ్చిన కొత్తలో చిరు ఇంటికి బాలయ్య స్వయంగా వచ్చి చరణ్ తో పాటు పిల్లలను డిన్నర్ కు తీసుకెళ్లిన సంఘటన, బాబాయ్ పవన్ తో చరణ్ కున్న మెమోరీస్ ఇవన్నీ చర్చలో వచ్చాయి. ప్రత్యేకంగా అంజనా దేవి, అమ్మ సురేఖ వీడియోలో చెప్పిన కొన్ని సంగతులు, రహస్యాలు బాగున్నాయి. 2025లో వాళ్ళ కోరికను లెటర్ ద్వారా పంపించడం మరో హైలైట్.
చరణ్ కెరీర్ తొలినాళ్లలో పాల్గొన్న ఆడిషన్ వీడియోని ప్లే చేసి చిన్నపాటి ర్యాగింగ్ చేసేసారు బాలయ్య. ఇంకా బోలెడు ఉన్నాయి కానీ అవన్నీ అక్కడ చూస్తేనే కిక్కు. అయితే ప్రభాస్ ఎదురు చూసిన ఫోన్ కాల్ ఎపిసోడ్ మాత్రం రెండో భాగానికి దాచేసి ట్విస్టు ఇచ్చారు. శర్వానంద్, యువి విక్రమ్, కుక్కపిల్ల రైమ్ వచ్చే ఘట్టం కూడా అందులోనే ఉంది. సో ఇక్కడితో ఎంటర్ టైన్మెంట్ అయిపోలేదు. చరణ్ తో బాలకృష్ణ చాలా సన్నిహితంగా మెలిగిన విధానం చూడముచ్చటగా అనిపించడం అతిశయోక్తి కాదు. 45 ఏళ్ళుగా మీ నాన్నతో ఇప్పుడు నీతో పోటీ పడుతున్నానని బాలయ్య చెప్పడం ఓ రేంజ్ లో పేలింది.
This post was last modified on January 9, 2025 11:17 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…