నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా జరిగిన తొక్కిసలాటలో ఏకంగా ఆరుగురు వెంకన్న భక్తులు కన్నుమూశారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఫలితంగా తిరుపతిలో బాధితుల తరఫు బంధువుల ఆర్తనాదాలు కలచివేస్తున్నాయి. యావత్తు భక్త లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఇలాంటి విషాద సమయంలో వేడుకలు ఎలా నిర్వహిస్తారు? అందుకే కాబోలు… ఈ విషాద ఘటనకు సంతాప సూచకంగా నందమూరి నట సింహం బాలకృష్ణ చిత్ర నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం అనంతపురం వేదికగా జరగాల్సి ఉన్న డాకు మహరాజ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
ఇటు రాజకీయాల్లో ఓ రేంజిలో రాణిస్తున్న బాలయ్య…సినిమాల్లో వరుస హిట్లతో మంచి ఊపు మీద ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమైంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాయలసీమలోని అనంతపురంలో గురువారం నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి అయ్యాయి. బాలయ్య అభిమానుల కోలాహలం మధ్య జరగనున్న ఈ కార్యక్రమానికి బాలయ్య అల్లుడు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.
అయితే ఏ ఒక్కరూ ఊహించని విధంగా బుధవారం రాత్రి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భారీగా తరలివచ్చిన భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ఈ టికెట్ల జారీ కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసినా… లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో తోపులాట జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. దీంతో ఏపీలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషాద ఘటనకు సంతాప సూచకంగా బాలయ్య సినిమా వేడుకను రద్దు చేస్తూ ఆ సినిమా నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమా రిలీజ్ దగ్గరపడటంతో ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండదని తెలుస్తోంది.
This post was last modified on January 9, 2025 10:27 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…