పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఏర్పడే సందిగ్దత, ఆలస్యం మిగిలిన వాటి మీద ప్రభావం చూపించడం చాలాసార్లు చూసిందే. కొన్నిసార్లు వాయిదాలు పడటం, ఓపెనింగ్స్ ని పరస్పరం దెబ్బ తీసుకోవడం అన్ని భాషల్లో చూసిన అనుభవమే. సరైన ప్లానింగ్, నిర్మాతల మధ్య అండర్ స్టాండింగ్ లేకపోతే వచ్చే సమస్య ఇది. జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వార్ 2ని ఆగస్ట్ 14 విడుదలకు అఫీషియల్ గా లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే దర్శకుడు అయాన్ ముఖర్జీ షూటింగ్ పూర్తి చేస్తూ పోస్ట్ ప్రొడక్షన్ కోసం తగిన సమయం పెట్టుకున్నాడు.
తీరా చూస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి కూడా అదే డేట్ మీద కన్నేసిందని చెన్నై అప్డేట్. ముందు వేసవిలో రావాలనుకున్నారు కానీ అప్పటికంతా పనులు పూర్తయ్యేలా లేకపోవడంతో బ్లాక్ బస్టర్ జైలర్ కు అచ్చివచ్చిన ఆగస్ట్ సెంటిమెంట్ ని ఫాలో కావాలని నిర్ణయించుకున్నారట. కూలిని తక్కువంచనా వేయడానికి లేదు. ఎందుకంటే దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, శృతి హాసన్ లాంటి పేర్లు ఎక్కడ లేని క్రేజ్ పెంచుతున్నాయి. కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్లతోనే బజ్ విపరీతంగా పెంచుకున్న రేంజ్ దీనిది. సో కూలి చూపించే ప్రభావం అంత ఈజీగా తీసుకోలేం.
ఒకవేళ ఇది నిజమైతే వార్ 2కి సౌత్ లో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ వర్గాల కథనం. ఇంకో ఎనిమిది నెలల సమయం ఉన్నప్పటికీ ఇలాంటివి ఇప్పటి నుంచే టెన్షన్ కలిగిస్తాయి. వార్ 2 మీద యష్ రాజ్ ఫిలిమ్స్ వందల కోట్లు కుమ్మరించింది. సోలో రిలీజ్ కోసమే ముందస్తుగా తేదీని లాక్ చేసుకుంది. అందుకే హిందీలో వేరెవరు క్లాష్ కు వెళ్లట్లేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు కూలి కనక ఆగస్ట్ 14 కావాలంటే మాత్రం పోటీ మహా రసవత్తరంగా మారుతుంది. చూడాలి మరి ఏం చేస్తారో.
This post was last modified on January 8, 2025 2:00 pm
ఏపీలో కీలకమైన ఇంటర్మీడియెట్ తొలి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని, రెండేళ్లుకలిపి ఒకేసారి నిర్వహిస్తున్నారని పేర్కొం టూ.. బుధవారం మధ్యాహ్నం…
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…