దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ముందుగా వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. స్టార్ హీరోల సినిమాల్లో కొంచెం అటుఇటుగా ఉన్న ఎపిసోడ్స్ ని సైతం తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేయడం ఎన్నోసార్లు చూశాం. జైలర్, దేవర, విక్రమ్, లియో లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. డేట్స్ లేవని తెలిసినా, ఆలస్యమవుతుందని చెప్పినా సరే దర్శక నిర్మాతలు ఎదురు చూసేందుకు వెనుకాడటం లేదు. ప్రస్తుతం తను తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న రెండు సినిమాలు విజయ్ దేవరకొండ 12, మేజిక్ కి పని చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదంతా బాగానే ఉంది అనిరుధ్ మ్యూజిక్ మీద ఒక కామెంట్ ఉంది. ఇప్పుడేదో ఊపేసినా, థియేటర్లలో డాల్బీ సౌండుతో అదరగొట్టినా తన పాటల్లో అధిక శాతం వాటికి లాంగ్ లైఫ్ లేదనేది ప్రధానంగా విన్పించే విమర్శ. ఏఆర్ రెహ్మాన్ ఈ విషయంలోనే ఒక సలహా ఇచ్చాడు. నిన్న చెన్నైలో జయం రవి – నిత్య మీనన్ నటించిన కాదలిక్క నేరమిల్లై ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా గెస్టుగా వచ్చిన అనిరుద్ ని ఉద్దేశించి మాట్లాడుతూ క్లాసికల్ టచ్, రాగాలను ఆధారంగా చేసే ప్రయోగాలు ఎక్కువ కాలం నిలుస్తాయని అలాంటివి కంపోజ్ చేయమని సలహా ఇచ్చాడు. ముందు అనిరుధ్ పనితనాన్ని పొగిడాకే తన ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.
ఎలా చూసినా రెహమాన్ చెప్పిన సలహా ముమ్మాటికీ ఆచరణీయం. ఎందుకంటే ఒకప్పటిలా ఇప్పటి ఆడియోలు లాంగ్ లైఫ్ దక్కించుకోవడం లేదు. ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం వచ్చిన ప్రేమికుడు, గీతాంజలి, రోజా, బొంబాయి లాంటి పాటలను ఇప్పుడు కూడా పదే పదే వింటున్నాం కానీ ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అనిరుధ్ సాంగ్స్ కి ఇంత రీచ్ ఉంటుందా అంటే సమాధానం చెప్పడం కష్టం. సో లెజెండరీ సలహాని పాటిస్తే గొప్ప ఫలితం అందుకోవచ్చు. కాదలిక్క నేరమిల్లైకు రెహమానే సంగీతం సమకూర్చారు. విడాముయార్చి తప్పుకోవడంతో దీన్ని పొంగల్ బరిలో దింపుతున్నారు నిర్మాతలు.
This post was last modified on January 8, 2025 12:58 pm
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…