ఎన్టీఆర్ నీల్ – ఇది మాములు సెట్టింగ్ కాదు…

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్యాన్ ఇండియా మూవీస్ లో ఒకటిగా తెరకెక్కబోతున్న వాటిలో జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోకి ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది. కెజిఎఫ్, సలార్ తర్వాత వాటికి మించిన అంచనాలు నెలకొంటున్నాయి. ప్రస్తుతం క్యాస్టింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ముందు నుంచి ప్రచారంలో ఉంది. అయితే ఇదే పేరుతో తమిళంలో ఆల్రెడీ ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ చిత్రం నిర్మాణంలో ఉంది. రిజిస్టర్ కూడా చేశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో మార్చిలోగా రిలీజ్ చేయబోతున్నారు.

సో డ్రాగన్ అనేది ఇప్పటికిప్పుడు ఖరారుగా చెప్పలేని మ్యాటర్. ఇక నటీనటుల ఎంపిక మెల్లగా కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. కొన్ని వారాల క్రితమే లీకైనట్టు కథానాయికగా రుక్మిణి వసంత్ లాకైనట్టే. నీల్ పాటించే సింగల్ హీరోయిన్ సూత్రం ఇక్కడా కొనసాగిస్తున్నారు. మలయాళం నుంచి టోవినో థామస్ ని ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నట్టు ఫ్రెష్ లీక్.

తారక్ తమ్ముడిగా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారట. విలన్ గా బిజూ మీనన్ ఫిక్సయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రకాష్ రాజ్ కూడా ఉంటారని తెలిసింది. వచ్చే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి హోంబాలే, ఎన్టీఆర్ ఫిలింస్ ఏర్పాట్లు చేస్తున్నాయి.

వార్ 2 పూర్తి కావడం కోసం ఎదురు చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆగస్ట్ 14న థియేటర్ ప్రేక్షకులను పలకరిస్తాడు. అటుపై కనక ప్రశాంత్ నీల్ అనుకున్న టైంలో పక్కా ప్లానింగ్ తో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయగలిగితే ముందు ప్రకటించినట్టు 2026 జనవరిలో సంక్రాంతి పండక్కుఎన్టీఆర్ నీల్ రిలీజవ్వొచ్చు.

అంటే ఆరు నెలల వ్యవధిలో యంగ్ టైగర్ నుంచి రెండు ప్యాన్ ఇండియా సినిమాలు వస్తాయి. వినడానికి బాగుంది కానీ ప్రాక్టికల్ గా ఎంతవరకు సాధ్యమో పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ డ్రామా సలార్ తరహాలో ప్రత్యేకమైన వరల్డ్ బిల్డింగ్ సెటప్ లో ఉంటుందట.