ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ సాధ్యం కాదు కానీ.. రాజు ఉన్నంతలో మంచి సక్సెస్ రేట్‌తో సాగిపోయేవాడు. ఒక సినిమా తేడా కొట్టినా ఇంకో చిత్రంతో హిట్టు కొట్టేవాడు. ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా అయినా, డిస్ట్రిబ్యూట్ చేసిన చిత్రమైనా ప్రేక్షకులకు ఒక గురి ఉండేది. అందుకే టాలీవుడ్లో రాజును జడ్జిమెంట్ కింగ్ అని పిలిచేవారు.
కానీ గత కొన్నేళ్లలో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయింది. రౌడీ బాయ్స్, ఎఫ్-3, థాంక్యూ, వారిసు, శాకుంతలం, ఫ్యామిలీ స్టార్.. ఇలా వరుసగా ఆయన్నుంచి నిరాశాజనకమైన చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా థాంక్యూ, శాకుంతలం, ఫ్యామిలీ స్టార్.. దిల్ రాజు జడ్జిమెంట్‌ను ప్రశ్నార్థకం చేశాయి. వీటిలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఫలితం తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టినట్లు, అంతర్మథనంలోకి నెట్టినట్లు దిల్ రాజు తెలిపాడు.
‘‘ఫ్యామిలీ స్టార్ రిజల్ట్ చూసి చాలా డిజప్పాయింట్ అయ్యాను. అప్పుడు ఏడేళ్ల నా మనవడు ఫోన్ చేసి డిజప్పాయింట్ అవ్వకు, నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది, దాంతో కొడతావ్ అన్నాడు. అది నాకు చాలా ఎమోషనల్‌గా అనిపింది. అప్పుడే నేను ఒక ఛేంజ్ తీసుకున్నాను. ఎలా ఇన్‌స్పైర్ కావాలి, ఎక్కడ పట్టుకోవాలని అనే ఆలోచన మొదలైంది.
సన్నిహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడే క్రమంలో అనుకున్న విధంగా సినిమాలు తీయలేకపోతున్నామయని అన్నారు. నాలో భయం మొదలైంది. స్టోరీ జడ్జ్‌మెంట్ పోయిందా? మళ్లీ కాంబినేషన్‌లకే వెళ్లాలా? అని ఆలోచించటం మొదలు పెట్టాను. శిరీష్ అయితే ఓవర్ లోడ్ కారణంగా సరిగా దృష్టిపెట్టలేకపోతున్నానని అన్నాడు. దీంతో వర్క్ అంతా స్ట్రీమ్ లైన్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే వాల్యూ ఉంటుంది.
చేతిలో ఏ సినిమాలున్నాయి, ఎలాంటి రిజల్ట్ తెచ్చుకోవాలని ఆలోచించటం మొదలు పెట్టాను. కానీ అదే సమయంలో శంకర్ గారి ఇండియన్-2 రిలీజైంది. దాని ఫలితమేంటో తెలిసిందే. దీంతో మళ్లీ గేమ్ చేంజర్ మీద శంకర్ గారితో డిస్కషన్లు పెట్టాను. ఆ సినిమా రిజల్ట్ నాకు, చరణ్‌కు, శంకర్ గారికి ఎంత ముఖ్యమో చెబుతూ.. వర్క్ చేస్తూ వచ్చాం.
ఈ సినిమాలో ప్రేక్షకులు విజిల్స్ కొట్టే మూమెంట్స్ చాలానే ఉంటాయి. మూడు, నాలుగున్నరేళ్ల ఎమోషన్స్‌కు మరో మూడు నాలుగురోజుల్లో ఫలితం రాబోతుంది. సంక్రాంతికి గేమ్ చేంజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నాం నాకు కమ్ బ్యాక్ ఫిల్మ్స్ అని నమ్మకంతో ఉన్నాను’’ అని రాజు తెలిపాడు.
This post was last modified on January 7, 2025 6:51 pm
పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఏర్పడే సందిగ్దత, ఆలస్యం మిగిలిన వాటి మీద ప్రభావం చూపించడం చాలాసార్లు చూసిందే.…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సంపూర్ణ భరోసా ఇస్తూ…
టీడీపీ-బీజేపీ నేతల మధ్య వివాదాలు తెరమీదికి వచ్చాయి.. సర్దుకునే ప్రయత్నం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. సాధారణంగా…
ఇటీవలే చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అభిమానులు కాని వాళ్ళు…
దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న సంగీత దర్శకుల్లో ముందుగా వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. స్టార్ హీరోల…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు మరింతగా ప్రాధాన్యం పెరిగింది. బుధవారం…