బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ ట్రైలర్ చూశాక అందరికీ వచ్చిన సందేహం ఒకటే. ఇంత గ్రాండ్ విజువల్స్, స్టయిలిష్ యాక్షన్ పెట్టుకుని కేవలం తెలుగుకే ఎందుకు పరిమితం చేస్తున్నారని. అది నిర్మాణ సంస్థ సితారకు వినిపించింది కాబోలు తమిళ, హిందీలోనూ సమాంతరంగా జనవరి 12నే విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం.
సినిమాలో ఉన్న మాస్ కంటెంట్ భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా నిర్ణయం మార్చుకున్నట్టు తెలిసింది. అంటే ఫ్యాన్స్ కి ట్రిపుల్ బొనాంజా అన్నమాట.
ఇవాళో రేపో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఒకరకంగా ఇది మంచి నిర్ణయమే. ఎందుకంటే డాకు మహారాజ్ క్యాస్టింగ్ అలా ఉంది. యానిమల్ నుంచి ఫేమ్ తెచ్చుకున్న బాబీ డియోల్ మరోసారి పవర్ ఫుల్ విలన్ రోల్ నీ దక్కించుకుంది ఇందులోనే. రవి కిషన్, షైన్ టామ్ చాకో లాంటి ఆర్టిస్టులు మరో ప్లస్.
తమన్ సంగీతానికి ఆల్రెడీ అన్ని భాషల్లో గుర్తింపు ఉంది కాబట్టి మార్కెటింగ్ పరంగా ఆ అంశం ఉపయోగపడుతుంది. గతంలో అఖండ, భగవంత్ కేసరిలకు సైతం ఒకే సమయంలో బాలీవుడ్ రిలీజ్ చేయాలనుకున్నారు కానీ సాధ్యపడలేదు. డాకు మహారాజ్ తో మొదలుపెడితే అఖండ 2తో కొనసాగించవచ్చు.
బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్, బిజినెస్ తో డాకు మహారాజ్ వస్తోంది. బందిపోట్ల అంతం చూసే నాయకుడిగా, ఆపదలో ఉన్న జనాలకు రక్షకుడిగా ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉండబోతున్నాయి. శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, ప్రగ్య జైస్వాల్, చాందిని చౌదరి ఇలా ప్రాధాన్యమున్న మహిళా పాత్రలు చాలానే ఉన్నాయి.
గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాంతో పాటు హిందీ, తమిళంలో ఇతర సినిమాల నుంచి చెప్పుకోదగ్గ పోటీ ఉన్నప్పటికీ డాకు మహారాజ్ కంటెంట్ పట్ల మేకర్స్ చాలా ధీమాగా ఉన్నారు. బాలకృష్ణని ఎప్పుడూ చూడనంత శక్తివంతంగా చూపించమని నిర్మాత నాగవంశీ చెప్పిన మాటలు అంచనాలు అమాంతం పెంచేశాయి.
This post was last modified on January 7, 2025 1:41 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…