రాంగోపాల్‍వర్మకి అపార జ్ఞానం వుంది. అనేక సినిమాలు చూసాడు… అంతకు పదింతల పుస్తకాలు చదివాడు. ఏ విషయంపై అయినా అనర్గళంగా మాట్లాడగలడు. ప్రతి అంశంపై తనదైన శైలిలో వివరణలు ఇవ్వగలడు. అయితే వర్మకు కాంట్రవర్సీ పిచ్చి. పబ్లిసిటీ యావ. అదే అతడిని రాంగ్ ట్రాక్ ఎక్కించి పబ్లిక్ దృష్టిలో పలుచన చేసింది. దానికి తోడు తాను తీసే సినిమాలు కూడా పోను పోనూ క్వాలిటీ కోల్పోయి అతడిని కింది గ్రేడ్ ఫిలింమేకర్స్ లిస్టులోకి తోసింది.
అదే తన శిష్యుడు పూరి జగన్నాథ్ జ్ఞాన సంపదను ఎలా వాడుకోవాలో చూపిస్తున్నాడు. ఫిలింమేకర్‍గా వర్మ రేంజ్ క్లాసిక్స్ పూరీ తీయలేదు. కమర్షియల్ డైరెక్టర్‍గా మాస్ జనాల మనసు దోచుకున్నాడు. అలాగే నాలెడ్జ్ పరంగాను వర్మతో పూరి సాటిరాలేడు. కానీ తనకున్న జ్ఞానాన్ని ఎలా వాడుకోవాలనేది పూరికి బాగా తెలుసు. అందుకే పాడ్ కాస్ట్లు ఇంకా ఇండియాలో బాగా పాపులర్ కాకముందే అవి మొదలు పెట్టి ఇప్పుడు యూత్ దృష్టిలో ఇంకా పెద్ద హీరో అయిపోయాడు.
రాంగోపాల్‍వర్మ మాదిరిగా టీవీ ఛానల్స్లోకి వచ్చి గంటల కొద్దీ మాట్లాడ్డం లేదు. లేదా ట్విట్టర్‍లో పడి చేంతాడంత ట్వీట్ త్రెడ్‍లు కూడా వేయడం లేదు. తనకు తెలిసింది సూటిగా సుత్తి లేకుండా చెబుతున్నాడు. నిన్న కాక మొన్నటి వరకు ఫ్లాప్ డైరెక్టర్ అన్న వాళ్ల చేతే జీనియస్ అనిపించుకుంటున్నాడు. పూరీ సృష్టించిన పండుగాడిని అడిగితే… ‘జ్ఞానం వుంటే సరిపోదు… దాన్నెలా వాడుకోవాలో తెలియాలి అన్నయ్యా’ అంటాడు.
This post was last modified on October 14, 2020 11:27 am
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతున్న కాకా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయ్యిందని ఇటీవలే రచయిత…
మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…
ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…