Movie News

ఇరువురు భామలతో ‘సంక్రాంతి’ వినోదం

పండగ పేరునే టైటిల్ గా పెట్టుకుని బరిలో దిగుతున్న సంక్రాంతికి వస్తున్నాం మీద ముందు ఏమో కానీ పాటలు, ప్రమోషన్లు చూశాక ఒక్కసారిగా ఫ్యామిలీ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా భీమ్స్ ఇచ్చిన మూడు పాటలు ఛార్ట్ బస్టర్స్ అయిపోయి అన్ని కలిపి 100 మిలియన్ల వ్యూస్ సాధించడం చూసి వెంకీ ఫ్యాన్స్ గర్వంగా ఫీలయ్యారు.

పబ్లిసిటీని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయంలో వంద శాతం సక్సెసయ్యాడు. దాంతో అందరి కళ్ళు ట్రైలర్ మీద పడ్డాయి. ఇవాళ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఎక్స్ లో మహేష్ బాబు ద్వారా ఈ లాంఛనం పూర్తి చేశారు.

ఆశించినట్టే మరోసారి అనిల్ రావిపూడి ఏదో సర్ప్రైజ్ ప్యాకేజ్ ప్లాన్ చేశారు. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే ఒక వ్యక్తి కిడ్నాప్ జరుగుతుంది. అతన్ని పట్టుకోవడానికి ఎక్కడో పెళ్లి చేసుకుని దూరంగా ఉన్న పోలీస్ ఆఫీసర్ (వెంకటేష్) ని తీసుకొచ్చేందుకు మరో లేడీ పోలీస్ (మీనాక్షి చౌదరి) వెళ్తుంది.

అయితే వీళ్లిద్దరి లవ్ స్టోరీ తెలిసిన భార్య (ఐశ్యర్య రాజేష్) ఈ ఆపరేషన్ లో తాను కూడా ఉంటానని పట్టు బడుతుంది. అక్కడి నుంచి అసలు కథ షురూ. పెళ్ళానికి చెప్పలేక, మాజీ ప్రియురాలిని మెప్పించలేక ఖాకీ చొక్కాలో నలిగిపోయే హీరో గారి తిప్పలు అన్ని ఇన్ని కావు. అవేంటో తెరమీద చూడాలి.

చిన్న యాక్షన్ టచ్ ఉన్న పాయింట్ తీసుకుని ఆద్యంతం వినోదాత్మకంగా చూపించాడు అనిల్ రావిపూడి. డైలాగుల్లో తనదైన మార్కు వినిపించింది. బ్రహ్మచారులకు ఇచ్చే సలహాలు, ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ సాధించాడని వెంకటేష్ గురించి చెప్పించడాలు బాగా పేలాయి.

ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ఇద్దరికీ నటనకు ఛాన్స్ దొరికింది. భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ సింపుల్ అండ్ స్మూత్ గా సాగగా మాస్ కి కావాల్సిన ఫైట్ల సరంజామా కూడా జోడించారు. వెంకటేష్ సినిమా నుంచి కోరుకునే అంశాలన్నీ పొందుపరిచినట్టు చూపించేశారు. మూవీ మొత్తం ఇలాగే ఉంటే బ్లాక్ బస్టర్ పక్కా.

This post was last modified on January 6, 2025 9:21 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

35 seconds ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

13 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

1 hour ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

3 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

4 hours ago