సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చునని ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ ఇంకా నిర్మాతలు పూర్తయిన తమ సినిమాలకు విడుదల తేదీలు ప్రకటించలేదు. దసరా పండుగ వస్తున్నా కానీ సినిమాలు థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకు రావడం లేదు. విశేషం ఏమిటంటే ఇంకా నిర్మాణ దశలో వున్న సినిమాలకు కూడా ఓటిటి రిలీజ్‍నే ప్రిఫర్ చేస్తున్నారు.
సినిమా థియేటర్లలో విడుదల చేయాలంటే బయ్యర్లు రావాలి, నిర్మాత అడిగినంత ఇవ్వాలి, ఆపై సినిమాకు కలక్షన్లు రావాలి. ఇంత ప్రాసెస్ ఇప్పటి పరిస్థితుల్లో జరుగుతుందా లేదా అనేదానిపై ఎవరికీ క్లారిటీ లేదు. అందుకే కొన్ని పెద్ద సినిమాలకు కూడా ఇంకా ఓటిటి కంపెనీలతోనే బేరసారాలు జరుగుతున్నాయి. లో బడ్జెట్ సినిమాలయితే ఓటిటి కంపెనీల నుంచి మంచి ఆఫర్ వస్తే థియేట్రికల్ రిలీజ్ స్కిప్ కొట్టేయడానికి సిద్ధంగా వున్నాయి.
సినిమా థియేటర్లు రన్ అవుతున్నాయా లేదా అనేది నిర్మాతల పరేషాన్ కానే కాదు. కరోనాకి ముందున్న మార్కెట్‍కి అనుగుణంగా బడ్జెట్ పెట్టుకున్న నిర్మాతలకు ఇప్పుడు బయ్యర్ల నుంచి ఆ స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. అందుకే మార్కెట్ మామూలు స్థితికి వచ్చేవరకు ఓటిటి రిలీజ్ ఉత్తమమని భావిస్తున్నారు. అదీ సంగతి.
This post was last modified on October 15, 2020 10:15 am
బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…
విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…
అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైక్రోసాఫ్ట్ సహా పలు ప్రముఖ కంపెనీలకు గ్రీన్…
ఒక అల్ట్రా డిజాస్టర్ కు సీక్వెల్ రావడం చాలా అరుదు. ఆ విషయంలో భారతీయుడు 3 కొత్త రికార్డుని సొంతం…
ఈ సోషల్ మీడియా కాలంలో సినిమాల్లో ఎవరిని ఉద్దేశించి ఏ పంచ్ వేసినా.. అది కాంట్రవర్శీగా మారడానికి ఎంతో సమయం…
ఎంత పెద్ద స్టార్ హీరోకైనా డిజాస్టర్లు సహజం. ఎన్టీఆర్ ఎంజిఆర్ నుంచి చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ దాకా అందరికీ అనుభవమే.…