ఓవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతుండగా.. ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ డెబ్యూ అంటే అకీరా నందన్‌దే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మెగా అభిమానులు ఎలా ఊగిపోతారో తెలిసిందే. ఆయనేమో ఫిలిం కెరీర్ మీద ఫోకస్ తగ్గించేసి రాజకీయాల్లో బిజీ అయిపోయారు.
ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసేలా ఉన్నారు. ఆ లోపు పవన్ తనయుడు అకీరా తెరంగేట్రం చేస్తే బాగుంటుందన్నది అభిమానులు ఆకాంక్ష. ఐతే అకీరా అయితే ప్రస్తుతానికి సినిమాల మీద పూర్తి స్థాయిలో దృష్టిసారించినట్లు కనిపించడం లేదు. ఓవైపు చదువు సాగిస్తూనే.. ఇంకోవైపు సంగీతం మీద ఫోకస్ చేస్తున్నాడు.
నటనలోనూ శిక్షణ తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు కానీ.. దాని గురించి సమాచారం ఏదీ బయటికి రాలేదు.ఈ నేపథ్యంలో కొడుకు అరంగేట్రం గురించి రేణు దేశాయ్ మాట్లాడ్డం మీడియా దృష్టిని ఆకర్షించింది. అకీరా సినిమాల్లోకి రావాలని తాను కూడా కోరుకుంటున్నానని రేణు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఐశ్వర్యా ఫుడ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీడియా వాళ్లు కొడుకు తెరంగేట్రం గురించి అడిగితే.. ‘‘అకీరా నందన్ ఎప్పుడు సినిమాల్లోకి వస్తారోనని అభిమానులందరూ ఎదురుస్తున్నారు. తన తల్లిగా ఆ ఆతృత నాకూ ఉంది. అకీరా నందన్ తన ఇష్టపూర్వకంగానే సినీ రంగ ప్రవేశం చేస్తాడు’’ అని రేణు వ్యాఖ్యానించారు.
మరోవైపు తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్ర వైపు రావాలన్న అక్కడి నాయకుల వ్యాఖ్యలపై రేణు స్పందిస్తూ.. ఇక్కడ ఇండస్ట్రీ ఎదిగితే తనకూ సంతోషమే అని చెప్పారు. గోదావరి ప్రాంతంలో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయని.. ఇక్కడి అందాలను చూడడానికి తనకు రెండు కళ్లూ సరిపోలేదని రేణు అన్నారు.
This post was last modified on January 5, 2025 8:12 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…