గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్‌ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం కొత్తేమీ కాదు కానీ.. దీన్ని ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా మార్చడం 2022లో మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా ‘పోకిరి’ సినిమాను రీ రిలీజ్ చేసినప్పుడే మొదలైంది. ఆ సినిమా రీ రిలీజ్‌ల్లో కొత్త రికార్డులు నెలకొల్పడం.. రిలీజ్ టైంలో అభిమానుల సెలబ్రేషన్ పీక్స్‌కు చేరడం చూసి.. మిగతా స్టార్ హీరోల అభిమానులు కూడా దీన్ని అనుసరించడం మొదలుపెట్టారు.
గతంలో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం రీ రిలీజ్‌లో సంచలన వసూళ్లు సాధించి ఔరా అనిపించాయి. టాలీవుడ్‌ను చూసి వేరే ఇండస్ట్రీల్లో సైతం ఈ రీ రిలీజ్ సంస్కృతిని అందిపుచ్చుకుంటున్నాయి. కోలీవుడ్లో సైతం స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేసి భారీ వసూళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఒరవడి బాలీవుడ్‌కు కూడా పాకుతోంది.
కొన్ని నెలల కిందట ‘తుంబాడ్’ అనే హార్రర్ థ్రిల్లర్‌ను రీ రిలీజ్ చేస్తే దానికి సంచలన వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ రిలీజ్ టైంలో కంటే ఇప్పుడే ఎక్కువ వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మరో పాత సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. రణబీర్ కపూర్, దీపికా పదుకొనే, బిపాసా బసు ముఖ్య పాత్రలు పోషించిన ‘యే జవానీ హై దివానీ’ సినిమా అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది.
‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రూపొందించిన ఈ చిత్రానికి రీ రిలీజ్‌లో బుక్ మై షోలో దాదాపు లక్ష టికెట్లు అమ్ముడయ్యాయి. శుక్రవారం కోటిన్నర దాకా వసూళ్లు వచ్చాయి. వీకెండ్లో కొత్త సినిమా లాగా ఇది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.
హిందీ హీరోలకు మన దగ్గర ఉన్నట్లు ఆర్గనైజ్డ్ ఫ్యాన్స్, సంఘాలు ఉండవు. మన అభిమానుల్లో ఉండే మ్యాడ్‌నెస్ కూడా కనిపించదు. ఈ సినిమా రీ రిలీజ్ గురించి రణబీర్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీనికి పబ్లిసిటీ కూడా లేదు. అయినా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది.
This post was last modified on January 4, 2025 6:45 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…