అసలు శతదినోత్సవం అనే మాటే సినీ పరిశ్రమ ఎప్పుడో మర్చిపోయింది. మూడు నాలుగు వారాలకు బ్రేక్ ఈవెన్ అయితే అదే గొప్పనుకునే ట్రెండ్ లో ఒక సినిమా వంద రోజులు ఆడటం చిన్న విషయం కాదు. గత ఏడాది వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్లు ఈ ఫీట్ సాధించగా తాజాగా దేవర కూడా ఈ లిస్టులో చేరింది.
అయితే ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు కాకుండా ఏకంగా ఆరు కేంద్రాల్లో హండ్రెడ్ డేస్ ఆడటం తారక్ అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. మలికిపురం, మండపేట, చిలకలూరిపేట, బి కొత్త కోట, కల్లూరు, రొంపిచెర్లలో ఈ మైలురాయి అందుకోవడం విశేషం.
నైజామ్, సీడెడ్ లాంటి ఏరియాల్లో లేకపోవడం కొంత లోటే అయినా పుష్ప 2 ది రూల్ సునామిలో దేవరను ఎగ్జిబిటర్లు ఇన్ని సెంటర్లలో హోల్డ్ చేయడం ఆశ్చర్యపరిచే విషయం. వసూళ్ల పరంగా చివరి రోజుల్లో మరీ పెద్ద నెంబర్లు నమోదు చేయకపోయినా ఉన్నంతలో లాభాలు కొంచెం తగ్గినా సరే దేవరకు ఎక్కడ నష్టాల ప్రస్తావన లేదు.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర హీరోలకున్న రాజమౌళి యాంటీ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి మరీ విజయం సాధించింది. అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ దక్కింది.
ఇప్పుడు అందరి డిమాండ్ దేవర 2నే. కాకపోతే ఎప్పుడు ఉంటుందనేది తెలియాల్సి ఉంది. వార్ 2 పూర్తయ్యాక తారక్ ప్రశాంత్ నీల్ షూటింగ్ మొదలుపెడతాడు. ఈ నెల లేదా ఫిబ్రవరిలో రెగ్యులర్ షూట్ ఉంటుంది. ఆ తర్వాత దేవర 2 ప్లాన్ జరగొచ్చు.
కొరటాల స్క్రిప్ట్ పనిలో ఉన్నాడనే టాక్ ఉంది కానీ ఎక్కడైనా కలుసుకునే సందర్భం వస్తే తప్ప క్లారిటీ రాదు. అల్లు అర్జున్ కు ఆయనో కథ చెబుతారనే ప్రచారం నేపథ్యంలో ఇంకొంత కాలం ఆగాల్సి ఉంటుంది. 45 రోజులకు నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన దేవర అక్కడ కూడా రికార్డులు నమోదు చేసింది. డిజిటల్ తర్వాత కూడా థియేటర్లలో కొనసాగించడం ఘనతే.
This post was last modified on January 4, 2025 1:06 pm
టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…
మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…
సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…
అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…
మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…