Movie News

శేఖర్ మాస్టర్.. తీరు మారాలి

గత దశాబ్ద కాలంలో తెలుగు సినిమాలో వేగంగా ఎదిగిన కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకడు. దివంగత రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేసి.. ఆ తర్వాత సొంతంగా అవకాశాలు అందుకుని ఎంతో కష్టపడి స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగాడు శేఖర్. మెగాస్టార్ చిరంజీవిని అమితంగా అభిమానించే శేఖర్.. ఆయన రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నంబర్ 150’లో తన ఆరాధ్య నటుడితో అదిరిపోయే స్టెప్పులు వేయించి తన కలను నెరవేర్చుకున్నాడు. గత కొన్నేళ్లలో శేఖర్ నుంచి ఎన్నో అదిరిపోయే పాటలు వచ్చాయి. ప్రస్తుతం తెలుగులో అతనే నంబర్ వన్ కొరియోగ్రాఫర్ అని చెప్పాలి.

ఐతే ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపించడానికి ప్రయత్నించే శేఖర్.. ఈ మధ్య ఒక రకమైన మూసలోకి వెళ్లిపోతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాస్ స్టెప్స్ పేరుతో తన స్టెప్పుల్లో వల్గారిటీ ఎక్కువ అయిపోతోందనే చర్చ నడుస్తోంది.

గత ఏడాది రవితేజ సినిమా ‘మిస్టర్ బచ్చన్’లోని సితార్ పాటలో శేఖర వేయించిన స్టెప్పులు వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా హీరోయిన్ బ్యాక్ మీద తబలాలా వాయించడం.. అలాగే బొడ్డు కింద చేయిపెట్టి డ్రెస్ లాగడం లాంటి స్టెప్స్ మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అంత అందమైన పాటలో ఇలాంటి స్టెప్స్ ఏంటి అనే చర్చ జరిగింది. డ్యాన్స్ మూవ్స్‌ రొమాంటిగ్గా ఉండేలా తీర్చిదిద్దడం ఓకే కానీ, ఇలా శ్రుతి మించకూడదని.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా కొంచెం దృష్టిలో ఉంచుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ శేఖర్ మళ్లీ మళ్లీ అలాంటి స్టెప్సే డిజైన్ చేస్తున్నాడు.

‘పుష్ప-2’లో పీలింగ్స్ సాంగ్‌లోనూ కొన్ని స్టెప్స్ టూమచ్ అనిపించాయి. స్టెప్స్ రొమాంటిగ్గా ఉండడం వేరు.. వల్గర్‌ ఫీలింగ్ కలిగించడం వేరు… ‘పుష్ప-2’ స్టెప్స్ రెండో కోవకే చెందుతాయనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ నుంచి రిలీజైన ‘దబిడి దిబిడి’ పాటలో స్టెప్స్ మీద మరింతగా విమర్శలు వస్తున్నాయి. ఈ పాటకు కూడా కొరియోగ్రాఫర్ శేఖరే. మూడు పాటల్లోనూ హీరోయిన్ బ్యాక్ మీద దరువు వేయడం కామన్‌గా కనిపిస్తుంది. అలాగే ‘సితార్’ పాటలో బొడ్డు కింద చేయి పెట్టి డ్రెస్ లాగే షాట్స్ కూడా మిగతా రెండు పాటల్లోనూ ఉన్నాయి. ఇలా రొమాంటిక్ స్టెప్స్ పేరుతో శేఖర్ హీరోలతో గీత దాటించేస్తున్నాడని.. ఇది మంచి పరిణామం కాదని.. ఈ మూస నుంచి అతను బయటికి రావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.

This post was last modified on January 4, 2025 10:42 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లాయర్ లేకుంటే విచారణకు నో అన్న కేటీఆర్

ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసిన…

23 minutes ago

చైనాలో బాహుబలి రికార్డు బ్రేక్ చేసిన మహారాజ!

విజయ్ సేతుపతి మహారాజ గత ఏడాది ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. తెలుగులో అంచనాలు లేకుండా రిలీజై…

1 hour ago

భారత్ లో తొలి హెచ్ఎంపీవీ కేసు?

సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత…

2 hours ago

గేమ్ ఛేంజర్ నెగిటివిటీ : దిల్ రాజు కాన్ఫిడెన్స్!

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలను నిర్మించి రిలీజ్ చేయడంతో పాటు మరో భారీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత దిల్…

2 hours ago

విశాల్ ఇలా కనిపించడం ఆందోళనే

నిన్న చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అందరూ షాక్ తిన్నారు.…

3 hours ago

ఆ ఒక్క చేప ఖరీదు 11 కోట్లు!

ప్రతి సంవత్సరం జపాన్‌లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల…

3 hours ago