టాలీవుడ్ లో అసలు అపజయమే ఎరుగని దర్శకుల్లో రాజమౌళి తర్వాత చెప్పుకోవాల్సిన పేరు అనిల్ రావిపూడి. కళ్యాణ్ రామ్ పటాస్ తో మొదలుపెట్టి బాలకృష్ణ భగవంత్ కేసరి దాకా ట్రాక్ రికార్డుని ఒకేలా మైంటైన్ చేయడం ఆయనకే చెల్లింది.
ఈ పండక్కు సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తో మూడోసారి వెంకటేష్ తో జట్టుకట్టిన ఈ ఎంటర్ టైనింగ్ డైరెక్టర్ మరోసారి ఎఫ్2, ఎఫ్3 మించిన ఫన్ ఇస్తానని గ్యారెంటీగా చెబుతున్నాడు. దానికి తగ్గట్టే పోటీ సినిమాల కన్నా వేగంగా తన సినిమా పాటలు ఛార్ట్ బస్టర్స్ అయిపోయి 90 మిలియన్ల వ్యూస్ దాటేసి వంద మైలురాయి వైపు పరుగులు పెడుతున్నాయి.
ఇదిలా ఉండగా రావిపూడి తర్వాత సినిమా సాహు గారపాటి నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్టోరీ లైన్ ఓకే కాగా స్క్రిప్ట్ కు సంబంధించిన డెవలప్మెంట్ల గురించి తాజాగా చిరు ఇంట్లోనే చర్చలు జరిగాయి.
ఈ నేపథ్యంలో చిరుని ఎలా చూపిస్తాడనే దాని మీద ఫ్యాన్స్ ఊహాగానాలు రకరకాలుగా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనిల్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వింటేజ్ చిరంజీవిని చూపించడం కాదు కానీ ఆయనను తాను ఎలా చూడాలని కోరుకుంటున్నానో అలాగే ప్రెజెంట్ చేస్తానని వివరణ ఇచ్చారు.
శ్రీకాంత్ ఓదెల ఒకలా చూపిస్తే నేను చిరంజీవిని ఇంకోలా చూపిస్తానని, ఫైనల్ గా ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా కథలు రాసుకుంటానని తేల్చి చెప్పాడు. మహేష్ బాబు, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్లతో పని చేసిన రావిపూడి ఇప్పుడీ మెగా ఆఫర్ ని ప్రమోషన్ గా భావిస్తున్నాడు.
కాకపోతే స్క్రిప్ట్ లాకయ్యాక చిరు క్యారెక్టరైజేషన్ గురించి చెబుతానంటున్నారు కాబట్టి ఇంకొన్ని వారాలు వేచి చూడక తప్పదు. విశ్వంభర చివరి దశలో ఉండటంతో బాలన్స్ పూర్తి చేయడంలో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ వేసవిలో థియేటర్లకు తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
This post was last modified on January 4, 2025 2:39 pm
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను…
ప్రస్తుతం పెద్ద సినిమాల్లో ప్రత్యేక అతిథి పాత్రలను క్రియేట్ చేసి పేరున్న నటులతో వాటిని చేయించడం ట్రెండుగా మారింది. ఈ…
తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. కొన్నాళ్ల పాటు మందగించినా.. ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మాదాపూర్లోని…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాక బెనిఫిట్ షోలకు ఈజీగా అనుమతులు రావడం మొదలైంది. రెండు చోట్లా అర్ధరాత్రి నుంచే…
ప్రపంచవ్యాప్తంగా హోటల్ బుకింగ్ ప్లాట్ఫారంగా గుర్తింపు పొందిన ఓయో ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మేజర్ వయసు ఉన్నవారెవరైనా…
గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటిదాకా నాలుగు పాటలు రిలీజైనా అభిమానులు హ్యాపీనే కానీ ఇంకేదో మిస్సయ్యిందనే ఫీలింగ్ వాళ్లలో కొంత…